మార్కెట్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ హీరోల్లో చాలామంది పాన్ ఇండియా సినిమాల మీద పడ్డారు. సినిమా ఇక్కడ హిట్ అవ్వకపోయినా బాలీవుడ్లో హిట్ అయ్యి మంచి కలెక్షన్లు వస్తే ఆటోమేటిక్ గా తెలుగులో కూడా సినిమా స్లోగా పికప్ అవుతుంది. ‘బాహుబలి ది బిగినింగ్’ ‘పుష్ప ది రైజ్’ వంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది. హీరోలే కాదు డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్క్రిప్ట్ లనే రెడీ చేసుకుంటున్నారు.
అయితే మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు వి.వి.వినాయక్ శైలి కొంచెం భిన్నంగా ఉంది. ఆయన తెలుగులో కాకుండా హిందీలో పాన్ ఇండియా తీస్తున్నారు. అది కూడా 17 ఏళ్ళ క్రితం టాలీవుడ్లో రూపొందిన ‘ఛత్రపతి’ ని రీమేక్ గా తీస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఇంకో వారం, పది రోజుల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది అంతే..! ఇదిలా ఉండగా.. వి.వి.వినాయక్ తెలుగులో స్టార్ డైరెక్టర్.
ఫామ్లో లేకపోయినా కరెక్ట్ కథ దిరికితే బ్లాక్ బస్టర్ కొట్టగల సత్తా ఉన్న దర్శకుడు. అయితే ఈయన హిందీ ప్రేక్షకులకి నచ్చేలా ఈ సినిమాని తీర్చిదిద్దరా అన్నది అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే ఆయనకి భాషకి సంబంధించిన సమస్యలుంటాయి.డబ్బింగ్ కరెక్ట్ గా వచ్చిందో లేదో అన్న విషయం పక్కాగా చూసుకోవాలి. ఈ విషయంలోనే వినాయక్ కూడా కిందా మీదా పడుతున్నట్టు వినికిడి. ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తేనే కానీ ఇప్పుడు ఇంకో సినిమా మొదలుపెట్టలేని పరిస్థితిలో వినాయక్ ఉన్నారు.
‘ఆర్ ఆర్ ఆర్’ని హిందీలో విడుదల చేసిన ‘పెన్ స్టూడియోస్’ అధినేత జయంతిలాల్ ఈ చిత్రానికి నిర్మాత. ఆయన తెలుగు సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేసి క్యాష్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ కంటే ముందే ఆయన ‘ఖిలాడి’ సినిమాని కూడా విడుదల చేశారు. కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు హిందీ ‘ఛత్రపతి’ పరిస్థితి ఏంటో..!
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!