VV Vinayak: వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న డైరెక్టర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దర్శకుడు వివి వినాయక్ గురించి పరిచయం అవసరం లేదు. ఈయన ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంది హీరోలకు మంచి సక్సెస్ సినిమాలను అందించారు. ఇలా డైరెక్ట్ గా గుర్తింపు పొందినటువంటి ఈయన ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.

ఇకపోతే మరికొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్నటువంటి తరుణంలో అందరి చూపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఉందని చెప్పాలి. ఇప్పటికే ఏపీలో అధికారంలోకి రావాలి అని అన్ని పార్టీ నేతలు పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేస్తున్నారు కొత్తవారికి కూడా అవకాశాలు కల్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ వివి వినాయక్ సైతం రాజకీయాలలోకి రాబోతున్నారని అది కూడా వైసిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఈయన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సిపి పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే వినాయక్ కూడా రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇలా వినాయక్ గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై ఆయన కుటుంబీకులు స్పందించి క్లారిటీ ఇచ్చారు. అసలు వినాయక్ కి రాజకీయాలు అంటే పడవని తాను రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని తెలియజేశారు. ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇటీవల వైయస్ జగన్ వెళ్లినటువంటి ఓ వివాహ వేడుకకు వినాయక్ కూడా హాజరు కావడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus