Samantha: ”ఎన్నో ఏళ్లు కష్టపడ్డాం.. సిరీస్ చూసి మాట్లాడండి”

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ వివాదానికి కారణమైంది. ఇందులో సమంత పోషించిన టెర్రరిస్ట్ పాత్ర పట్ల తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళుల హక్కుల కోసం పోరాడిన తమిళ టైగర్లను ఈ సిరీస్ లో తప్పుగా చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. సమంతతో పాటు టీమ్ మొత్తాన్ని టార్గెట్ చేశారు తమిళులు. ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

రీసెంట్ గా ఈ సిరీస్‌ను ఆపాలంటూ కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖా మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌ కు లేఖ రాశారు. దీంతో ఈ సిరీస్ కి బ్రేకులు తప్పవనే మాటలు వినిపించాయి. తాజాగా ఈ వివాదంపై సిరీస్ దర్శకులు రాజ్-డీకే స్పందించారు. ట్రైలర్ చూసి ఓ అంచనాకు రావొద్దని.. అందరూ అనుకుంటున్నట్లుగా ఈ సిరీస్ ను ఎవరి మనోభావాలను హర్ట్ చేసేలా రూపొందించలేదని చెప్పారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ రిలీజయ్యే వరకు ప్రతి ఒక్కరూ వేచి చూడాల్సిందిగా కోరారు. ఒకసారి సిరీస్ చూసిన తరువాత అందరూ ప్రశంసిస్తారనే విషయం తమకు తెలుసునని అన్నారు.

ట్రైలర్ లో చూపించిన కొన్ని షాట్స్ చూసి కథాంశాన్ని అంచనా వేసి.. సిరీస్ ను తప్పుగా చూస్తున్నారని అన్నారు. ఈ షోలో చాలా మంది తమిళులు నటించారని.. తమకు కూడా తమిళ ప్రజల మనోభావాలు, వారి సంస్కృతి పట్ల అవగాహన ఉందని అన్నారు. అలాంటప్పుడు వారిని బాధ పెట్టే విధంగా షోను ఎందుకు రూపొందిస్తామని ప్రశ్నించారు. ఈ సిరీస్ రూపొందించడం వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉందని.. కాబట్టి షో ప్రసారమయిన తరువాత చూసి అప్పుడొక అంచనాకు రావాల్సిందిగా కోరారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus