18 ఏళ్ళ కెరీర్లో ఎన్టీఆర్ 28 సినిమాల్లో నటించాడు. 2001 లో ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. అతి తక్కువ సమయంలోనే ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘ఆది’ ‘సింహాద్రి’ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. అంతేకాదు మాస్ లో ఎన్టీఆర్ కు తిరుగులేని ఇమేజ్ ఉంది. దానిని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ ప్రతీ ఏడాది.. ఒకటో, రెండో సినిమాలతో అభిమానులని పలకరిస్తూనే వచ్చాడు. అయితే 2009 లో మాత్రం.. ఆయన యాక్సిడెంట్ కు గురవ్వడంతో.. ఆ ఏడాది ఎన్టీఆర్ నుండీ సినిమా రాలేదు.
అయితే 2010 లో ‘అదుర్స్’ ‘బృందావనం’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టి ఆ లోటుని తీర్చేసాడు. అప్పటి నుండీ ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూనే వస్తున్నాడు. అయితే మళ్ళీ 2019 లో మాత్రం ఆయన నుండీ సినిమా రాలేదు. ఎన్టీఆర్ నుండీ వచ్చిన గత చిత్రం ‘అరవింద సమేత’ .. 2018 లో విడుదలయ్యింది. అయితే ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు. సాధారణంగా రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్న ఏ హీరో నుండి అయినా.. రెండేళ్ళ వరకూ సినిమా రాదు. అందులోనూ ‘ఆర్.ఆర్.ఆర్’ పాన్ ఇండియా చిత్రం కాబట్టి.. ఫ్యాన్స్ కు ఆ మాత్రం వెయిటింగ్ తప్పదు మరి. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం జూలై 30న విడుదల కాబోతుందని రాజమౌళి అలాగే నిర్మాత దానయ్య ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.