‘కౌన్ బనేగా కరోడ్ పతి’… హిందీలో ఎప్పటి నుండో సూపర్ హిట్ షోగా సాగుతోంది. అమితాబ్ బచ్చన్ వరుసగా సీజన్లను హోస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఇమేజ్, అక్కడి ప్రేక్షకుల ఆసక్తితో కార్యక్రమం జోరుగా సాగిపోతోంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ పరిస్థితి కూడా ఇంతే. దీంతో ఈ టీఆర్పీలతో షో నడపడం కష్టమే అంటున్నారు పరిశీలకులు. నాగార్జున హోస్ట్‌గా తెలుగులో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమం స్టార్ట్ అయ్యి…
కొన్నేళ్లు బాగానే నడించింది. అయితే నాగ్ తప్పుకోవడంతో… ఆ స్థానంలోకి చిరంజీవి వచ్చారు. ఒక సీజన్‌తో తర్వాత ఏకంగా మాటీవీ షోను వదులుకుంది. ఇప్పుడు జెమినిలో ఎన్టీఆర్ ఆ షోను నడిపిస్తున్నారు. తొలినాళ్లలో అద్భుతమైన ఆదరణతో దూసుకెళ్లిన కార్యక్రమం ఇప్పుడు మోస్తరు టీఆర్పీ రేటింగ్‌లు దక్కించుకోలేక ఇబ్బందులు పడుతోందట. 11.4 రేటింగ్‌తో లాంచింగ్ ఎపిసోడ్ అదరగొట్టాడు తారక్. ఆ తర్వాత ఆ రేటింగ్ సుమారు సగానికి పడిపోయింది.6 నుండి 7 మధ్య టీర్పీతో కార్యక్రమం నడుస్తూ వచ్చింది.
కానీ ఇటీవల కాలంలో ఆ టీఆర్పీ ఏకంగా నాలుగు దిగువకు చేరిపోయిందని సమాచారం. ఒక షో నడవడానికి ఈ టీర్పీ ఏ మాత్రం మంచిది కాదు. తారక్ తన పాత్రను పక్కగా పోషిస్తున్నప్పటికీ… షో రేటింగ్ పెరగడం లేదు. దీంతో వచ్చే సీజన్ ఉంటుందా? అనే ప్రశ్న మొదలైంది.