Vijay Deverakonda : ‘ది’ విజయ్‌ పెళ్లి.. డిస్కషన్‌ దీని చుట్టూనే.. ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు?

పెళ్లి వయసు వస్తే చాలు.. ఆ కుర్రాడు కానీ, అమ్మాయి కానీ బంధువుల మధ్యకు వెళ్తే ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘పెళ్లెప్పుడు, పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్‌’. మీకు కూడా ఈ మాట ఎదురయ్యే ఉంటుంది. కొంతమందికి ఇంకా ఎదురువుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఎర్లీగా పెళ్లి చేసుకునే వాళ్లూ ఉంటారు అనుకోండి. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? మామూలు జనాలకు కేవలం బంధువుల దగ్గర ఈ చర్చ వస్తే.. సినిమా వాళ్లకు మాత్రం ఎక్కడకు వెళ్లినా వస్తుంది కాబట్టి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్లకు ఈ ప్రశ్న తరచుగా వస్తూనే ఉంది. అదీ సినిమాల రిలీజ్‌ల దగ్గర్లో మీడియా ముందుకు వస్తేనే, లేక ఏదైనా షోకి వెళ్తేనే ఈ ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’ సినిమా ప్రచారం కోసం అన్ని గడపలు తొక్కుతున్నాడు. సమంత వ్యక్తిగత టూర్లలో బిజీగా ఉండి, సినిమా ప్రచారాన్ని పక్కన పెట్టడంతో మొత్తం విజయ్‌ దేవరకొండ చూసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓ టీవీ డ్యాన్స్ షోకి వచ్చాడు. ఈ క్రమంలోనే విజయ్‌కి పెళ్లి ప్రశ్న ఎదురైంది.

షోలోకి ‘అది నా పిల్ల’ అంటూ ఎంట్రీ ఇచ్చిన విజయ్‌ దేవరకొండను ఆ షో జడ్జిలు రాధ, తరుణ్‌ మాస్టర్‌, సదా వరుస ప్రశ్నలు వేశారు. ఇందులో ఎక్కువగా పెళ్లి గురించే ఉండటం విశేషం. ‘మీ పెళ్లి ఎప్పుడు అని విజయ్‌ని యాంకర్‌ శ్రీముఖి అడగటంతో.. ‘అందరితో మాట్లాడుతున్నాను’ అని విజయ్ చెప్పాడు. దానికి ‘అందరినీ చేసుకోవడం కుదరదు కదా’ శ్రీముఖి పంచ్ వేసింది. ఆ తర్వాత విజయ్‌ మాట్లాడుతూ ‘ఇంట్లో వాళ్లు తమకు కావలసిన వాళ్లను చేసుకోమని అంటున్నారని, పెళ్లి కోసం తొందర పెడుతున్నారు’ అని చెప్పాడు.

దీంతో రాధ ‘వారి సంతోషం కోసం చేసుకోవాలి కదా’ అని అనగా ‘అందుకే వాళ్లనే పెళ్లి చేసుకోమని అన్నాను’ అని విజయ్ అన్నాడు. దీంతో కార్యక్రమంలో ఒక్కసారి నవ్వులు విరిశాయి. ఇంత ఇబ్బంది లేకుండా విజయ్‌ ఆ పెళ్లి ముచ్చట ఏదో చెప్పేయొచ్చుగా. సినిమా పరిశ్రమకు ఏ మాత్రం సంబంధం లేని ఓ అమ్మాయితో విజయ్‌ ప్రేమలో ఉన్నాడని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇది కాకుండా నేషనల్‌ క్రష్‌తో లవ్‌ ఉన్నట్లు టాక్‌. ఇందులో ఏది నిజమో (Vijay Deverakonda) విజయ్‌ చెప్పాలి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus