అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నటించిన ‘తండేల్’ (Thandel) సినిమా ఈ శుక్రవారం అనగా ఫిబ్రవరి 5న విడుదల కాబోతోంది. సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకుడు. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu) ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో సగం పైనే రికవరీ అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం రూ.50 కోట్ల వరకు రికవరీ అయ్యిందని వినికిడి.
Thandel
ఇంకా శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ రైట్స్ వంటివి మిగిలే ఉన్నాయి. ఎటు చూసుకున్నా ఇది ప్రాఫిటబుల్ మూవీనే..! అయితే నిర్మాతలు ఎందుకో.. అత్యాశకి పోతున్నారేమో అనే సందేహం అందరిలోనూ ఏర్పడుతుంది. ఎందుకంటే.. ‘తండేల్’ సినిమాకి టికెట్ రేట్లు పెంచమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిర్మాతలు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అందుకు ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ థియేటర్స్ లో రూ.52 , మల్టీప్లెక్సుల్లో రూ.75 వరకు పెంచుకునే ఛాన్స్ ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.
అయితే ఓ మిడ్ రేంజ్ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఎందుకు? భారీ బడ్జెట్ సినిమాలకి పలు కేటగిరిల్లో టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ప్రభుత్వం ఇస్తుంది. పండుగ టైంలో కూడా టికెట్ రేట్లు పెంచుతారు. వాటిని ప్రేక్షకులు తప్పుబట్టడం లేదు. కానీ నాగ చైతన్య వంటి మిడ్ రేంజ్ హీరో సినిమాకి కూడా రూ.250 , రూ.200 టికెట్ రేట్లు పెంచితే జనాల్లో థియేటర్ కి రావాలనే ఆసక్తి సన్నగిల్లుతుంది కదా?
ఇది నిర్మాతలకి అర్ధం కాలేదా? లేక వాళ్ళ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్సా? ఇది వాళ్ళకే తెలియాలి. సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు. పైగా ఫిబ్రవరి అనేది అన్ సీజన్.ఈ టైంలో జనాలు థియేటర్లకు రావడమే ఎక్కువ.అలాంటప్పుడు ఓ మిడ్ రేంజ్ సినిమాకి టికెట్ రేట్లు పెంచితే వచ్చే జనం కూడా రాకపోవచ్చు. ఎంతో అనుభవం కలిగిన అల్లు అరవింద్ వంటి నిర్మాతలకి ఇది తెలీనిది కాదు.