సౌత్ ఇండియా లో అన్నీ భాషల్లో సమానమైన పాపులారిటీ మరియు క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అర్జున్ సర్జా. అందరూ ఈయనని యాక్షన్ కింగ్ అని పిలుస్తూ ఉంటారు, కెరీర్ ప్రారంభం నుండి ఆయన చేసిన సినిమాలు అలాంటివి. అందుకే ఆయన్ని అలా పిలుస్తారు. కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే కాదు, సెంటిమెంట్ ఉన్న సినిమాలు, అలాగే కామెడీ సినిమాలు కూడా ఆయన చేసాడు. కానీ వాటిని ఆయన చేసే యాక్షన్ మూవీస్ పాత్రలు డామినేట్ చెయ్యడం వల్లే యాక్షన్ కింగ్ అనే పేరు స్థిరపడిపోయింది.
అసలు అర్జున్ కి (Arjun Father) సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉండేది కాదట. మొదటి నుండి ఆయన పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కనేవాడట. అండ్డుకోసమే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడట. కానీ తండ్రి శక్తి ప్రసాద్ సినీ పరిశ్రమకి చెందిన వాడు కావడంతో బాల్యం నుండే సినిమాలు చేయాల్సి వచ్చిందట. అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్ ఆషామాషీ నటుడు అని అనుకుంటే పొరపాటే. ఈయన కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అప్పట్లో పెద్ద సూపర్ స్టార్. ఈ విషయం నేటి తరం ప్రేక్షుకులెవ్వరికీ తెలియకపోవడం విశేషం.
శక్తి ప్రసాద్ 1967 వ సంవత్సరం లో ‘ఇమ్మడి పులికేషి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం. ఈ సినిమాలో రాజ్ కుమార్ హీరో గా నటించాడు. అలా కన్నడ ప్రేక్షకులకు పరిచయమైనా శక్తి ప్రసాద్, అనతి కాలంలోనే క్యారక్టర్ ఆర్టిస్టుగా , హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు , ఎంతోమంది లెజండరీ నటులతో కలిసి నటించాడు. అలా ఆయన నట ప్రస్థానం 1986 వ సంవత్సరం వరకు కొనసాగింది. దురదృష్ట కొద్దీ అదే సంవత్సరం లో ఆయన కూడా చనిపోయాడు. ఇక ఆయన కొడుకు గా వచ్చిన అర్జున్, తండ్రికి పది రేట్లు పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.