Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ దూకుడుకి తట్టుకోలేకపోయిన సినిమాలు ఎన్నంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పుడు ‘దేవర’ అనే సినిమా రూపొందుతుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో.. ‘దేవర’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు నిర్మాత మిక్కిలినేని సుధాకర్. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్లు ఈ మూవీలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో గతంలో ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2016 వ సంవత్సరం సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదలైంది. అంటే నేటితో ఈ చిత్రం విడుదలై 7 ఏళ్ళు పూర్తికావస్తోందన్న మాట. ‘టెంపర్’ ‘నాన్నకు ప్రేమతో’ వంటి హిట్లతో ఎన్టీఆర్… ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ వంటి హిట్లతో కొరటాల శివ.. మంచి ఫామ్లో ఉన్న టైములో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. వీరిద్దరికీ ఇది హ్యాట్రిక్ సక్సెస్ ను అందించింది.

ఎన్టీఆర్ – మోహన్ లాల్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు విజిల్స్ కొట్టించే విధంగా ఉంటాయని చెప్పొచ్చు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా.. ‘జనతా గ్యారేజ్’ చిత్రం రిలీజ్ అయ్యి 7 ఏళ్ళు పూర్తికావస్తున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక ఈ చిత్రం రిలీజ్ అయిన టైంలో పక్కన చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.

నారా రోహిత్ – నాగ శౌర్య ల ‘జ్యో అచ్యుతానంద’ యావరేజ్ కాగా, శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన ‘నిర్మల కాన్వెంట్’ ప్లాప్ అయ్యింది. నాని నటించిన ‘మజ్ను’ కూడా యావరేజ్ గానే ఆడింది. రామ్ నటించిన ‘హైపర్’ పెద్ద ప్లాప్ అయ్యింది. నాగ శౌర్య ‘నీ జతలేక’, సునీల్ నటించిన ‘ఈడు గోల్డ్ ఎహె’ ‘మా ఊరి రామాయణం’ వంటి సినిమాలు అన్నీ (Janatha Garage) ‘జనతా గ్యారేజ్’ దెబ్బకి బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus