పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఈ సినిమా తర్వాత వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఏ సినిమా కూడా సక్సెస్ అందించలేక పోయింది కానీ సలార్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనమైనటువంటి రికార్డులను సృష్టిస్తోంది.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ తదుపరి సినిమాలపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రభాస్ ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలా ఉండగా తాజాగా ప్రభాస్ నికర ఆస్తుల విలువ ఎంత అనే విషయం గురించి ఫోర్బ్స్ మీడియా సర్వే ప్రకారం ఒక వార్త వైరల్ గా మారింది.
అంతర్జాతీయ సంస్థ ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రభాస్ బాహుబలి సినిమా చేయకముందు ఆయన నికర ఆస్తుల విలువ 145 కోట్లుగా పేర్కొన్నారు. అయితే బాహుబలి తర్వాత ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగాయని ఫోర్బ్ ఓ కథనాన్ని వెల్లడించింది. 2015 వరకు ఆయన మూడుసార్లు ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో ప్రభాస్ ఉండటం గమనార్హం (Prabhas) ప్రభాస్ ఖరీదైన ఆస్తుపాస్తులను కలిగి ఉన్నారు అనే సంగతి మనకు తెలిసిందే.
హైదరాబాదులో సుమారు 60 కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని ముంబైలో కూడా 10 కోట్ల విలువ చేసే ఇల్లు అలాగే ఇటలీలో కూడా ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది. వీటితోపాటు కొన్ని కోట్లలో విలువచేసే కార్లు కూడా ఈయన వద్ద ఉన్నాయి. ఫోర్బ్స్ కంపెనీ లెక్కల ప్రకారం.. ప్రభాస్ నికర ఆస్తుల విలువ 30 మిలియన్ డాలర్లు.. అంటే సుమారుగా 250 కోట్ల రూపాయలుగా విలువ కట్టారు. సలార్ సినిమా తర్వాత ఆయన ఆస్తుల విలువ, ఆదాయం విలువ భారీగా పెరిగే అవకాశం ఉంది.