Prabhas: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ వేసుకున్న డ్రెస్ ఆవ్యక్తి గిఫ్టుగా ఇచ్చారా!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆది పురుష్ సినిమా ద్వారా జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా రామాయణం ఇతిహాసంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ప్రీరిలీజ్ వేడుకను తిరుపతిలో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో ప్రభాస్ చాలా అందంగా కనిపించడమే కాకుండా అందరిని ఆకట్టుకున్నారని చెప్పాలి.

వైట్ అండ్ వైట్ ధరించి చాలా హ్యాండ్ సమ్ గా కనిపించారు ఇలా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో ప్రభాస్ ధరించిన డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకు ప్రభాస్ ధరించిన డ్రెస్ గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ డ్రెస్ ఖరీదు ఎంత ఉంటుందని కూడా అభిమానులు చర్చలు మొదలుపెట్టారు. ఇక ప్రభాస్ ధరించిన ఈ డ్రెస్ ఎంత ఉంటుంది ఏంటి అనే విషయానికి వస్తే… నిజానికి ప్రభాస్ కి ఈ డ్రెస్ ను కానుకగా ఇచ్చారని తెలుస్తుంది.

డైరెక్టర్ ఓం రౌత్ ప్రత్యేకంగా ప్రభాస్ (Prabhas) కోసం స్పెషల్ డిజైనర్ చేత ఈ డ్రెస్ ను డిజైన్ చేయించారట ఇలా డిజైన్ చేయించిన ఈ డ్రెస్ ను ప్రభాస్ కి కానుకగా ఇవ్వడంతో ఈయన ప్రీ రిలీజ్ వేడుకకు అదే డ్రెస్సును వేసుకున్నారనే తెలుస్తుంది. ఇక ఈ డ్రెస్ కోసం ఓం రౌత్ సుమారు పది లక్షల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది. ఇలా డైరెక్టర్ ఎంతో అభిమానంతో తనకు ప్రత్యేకంగా డిజైన్ చేయించి డ్రెస్ కానుకగా ఇవ్వడంతో ప్రభాస్ అదే డ్రెస్సులో ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేశారు.

ఇలా ఈ డ్రెస్ ఖరీదు 10 లక్షలు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అభిమానుల సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus