మలయాళం మార్కెట్ చాలా చిన్నది అని అంతా భావిస్తుంటారు.రూ.3 కోట్లకి,రూ.5 కోట్లకి మించి అక్కడ మార్కెట్ ఉండదు అనేది జనాల మాట. అక్కడ మోహన్ లాల్ వంటి హీరోల సినిమాలకు మాత్రమే భారీ రేటు పలుకుతుంటుంది. ఇప్పుడిప్పుడే దుల్కర్, పృథ్వీ రాజ్ సుకుమారన్, వంటి వాళ్ళు మార్కెట్ విషయంలో స్ట్రాంగ్ అవుతున్నారు. వీళ్ళతో సమానంగా కాకపోయినా… మమ్ముట్టి కంటే బెటర్ గా టాలీవుడ్ నుండీ మన అల్లు అర్జున్ మలయాళంలో మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
అక్కడ కూడా మన బన్నీ కింగే..! అయితే తెలుగు హీరోల్లో.. మలయాళంలో కోటి వసూల్ చేసిన హీరో మాత్రం మన మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో కె. దేవీ వరప్రసాద్ నిర్మాణంలో చిరంజీవి చేసిన ‘ఘరానా మొగుడు’ చిత్రం మలయాళంలో కూడా డబ్ అయ్యి రూ.1 కోటి పైగా గ్రాస్ వసూళ్ళని రాబట్టింది. ఇప్పటి రోజులతో పోల్చుకుంటే అది రూ.10 కోట్ల పైనే అవుతుందేమో..!
‘హే హీరో’ పేరుతో ఈ మూవీ అక్కడ కేవలం 12 ప్రింట్లతో రిలీజ్ అయ్యి 50 రోజులకి 21 ప్రింట్లతో దిగ్విజయంగా రన్ అయ్యింది.ఈ చిత్రంలో చిరంజీవి సరసన నగ్మా,వాణి విశ్వనాథ్ లు హీరోయిన్లుగా నటించారు.నిజానికి ఈ చిత్రాన్ని మలయాళంలో డబ్ చెయ్యాలనే ఆలోచన చిరుకి కానీ రాఘవేంద్ర రావు గారికి కానీ లేదు. కానీ సెవెన్ ఆర్ట్స్ అధినేతలైన విజయ్‌కుమార్, జయ్‌కుమార్ బ్రదర్స్ ను ‘ఘరానా మొగుడు’ లో చిరు నటన,డ్యాన్స్ లు బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ మూవీని అక్కడ డబ్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!