టాలీవుడ్ స్టార్స్ తాము సినిమాల్లో సంపాదించింది మిగతా రంగాల్లో పెట్టుబడిగా పెడుతూ వ్యాపార వేత్తలుగానూ రాణిస్తున్నారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్, భార్య నమ్రత పేరు మీద హోటల్ బిజినెస్ ప్రారంభించారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ వాళ్లతో కలిసి మహబూబ్ నగర్‌లో ఏవీడీ సినిమాస్ స్థాపించిన సంగతి తెలిసిందే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే..
మల్టీప్లెక్స్, నిర్మాణ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏ ఏ ఏ సినిమాస్ (ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్) స్థాపిస్తున్నాడు. అమీర్ పేట్ సత్యం థియేటర్‌ని పడగొట్టి.. అదే ప్లేసులో నిర్మిస్తున్నారు.. ఆధునిక హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో అద్భుతంగా తీర్చి దిద్దిన ఏషియన్ సత్యం మాల్ & మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయింది.. జనవరిలో ప్రారంభించాలనుకున్నారు కానీ ఫినిషింగ్ టచ్చెస్ వర్క్ వల్ల డిలే అయింది..
దాదాపుగా పూర్తి కావచ్చిన AAA సినిమాస్ మరికొద్ది రోజుల్లో గ్రాండ్‌గా లాంఛ్ కానుంది.. లేటెస్ట్ క్రేజీ న్యూస్ ఏంటంటే.. ఇక్కడ అల్లు అర్జున్ తన స్టాచ్యూ ఏర్పాటు చేయబోతున్నాడట.. ప్రస్తుతం విగ్రహానికి సంబంధించిన డిజైన్ వర్క్ అదీ జరుగుతోందట.. విగ్రహాన్ని అనుభవజ్ఞులైన ఆర్టిస్టులతో అత్యంత ప్రత్యేంకంగా తీర్చిదిద్దుతున్నారట.. త్వరలో దీని గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.. పాండమిక్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప’ క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు..
2021లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ రాజ్‌గా బన్నీ నార్త్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు.. ‘పుష్ప’ కి ఏమాత్రం తగ్గకుండా ఇంకా పది రెట్లు అధికంగా అచనాలు ఆకాశాన్నంటేలా తెరకెక్కుతోంది ‘పుష్ప : ది రూల్’.. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు కానుకగా.. మూడు నిమిషాల యాక్షన్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు టీమ్.. ఇప్పటికే టీజర్ కట్ చేశారని.. దానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ అవుతుందని తెలుస్తోంది..