‘పోకిరి’ (Pokiri) చిత్రంతో సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు (Mahesh Babu). అయితే ఆ తర్వాత చేసిన ‘సైనికుడు’ (Sainikudu) ‘అతిథి’ (Athidhi) సినిమాలు నిరాశపరిచాయి. 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో చేసిన ‘ఖలేజా’ (Khaleja) కూడా డిజాస్టర్ అయ్యింది. టీవీల్లో ఆ సినిమాని చూసి మెచ్చుకున్న ఆడియన్స్ ఉన్నారు కానీ, ఎందుకో థియేటర్లలో జనాలు చూడలేదు. ఇక 5 ఏళ్ళు హిట్టు లేకుండా కాలం గడిపిన మహేష్.. శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో ‘దూకుడు’ (Dookudu) చేశాడు.
Dookudu
ఇది మహేష్ కి మంచి హిట్ ఇచ్చింది. తర్వాత అతని స్టార్ డం సాయంతో బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ రూ.100 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. టాలీవుడ్లో ‘మగధీర’ (Magadheera) తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘దూకుడు’ ఆల్ టైం రికార్డులు సృష్టించింది. ఓవర్సీస్లో 1 మిలియన్ కి పైగా డాలర్లను కలెక్ట్ చేసి.. తెలుగు సినిమా రేంజ్..ను పెంచింది ‘దూకుడు’. ’14 రీల్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట.
గోపీచంద్ ఆచంట (Gopichand Achanta)..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఫైనల్ ఔట్పుట్ చూసుకున్నాక నిర్మాతలకి ఎందుకో ఈ సినిమా సక్సెస్ పై నమ్మకం కలగలేదట. దర్శకుడు శ్రీను వైట్ల కూడా వీళ్ళని చూసి కంగారు పడిపోయాడట. అయితే మహేష్ బాబు మాత్రం మొదటి నుండి నమ్మకంతో ఉన్నాడట. అయితే అతను ఫైనల్ కాపీ చూడక ముందు డిస్ట్రిబ్యూటర్లకు షో వేశారట. వాళ్ళు కూడా మిక్స్డ్ టాక్ చెప్పారట.
కానీ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ (Krishna), మహేష్ బాబుతో కలిసి ఫైనల్ కాపీ చూశారట. సినిమా చూశాక ఆయన ‘కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మహేష్ బాబు కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధిస్తుంది’ అని ధీమాగా చెప్పారట. తర్వాత ఆయన చెప్పిందే జరిగింది. 2011 సెప్టెంబర్ 23 న రిలీజ్ అయిన ‘దూకుడు’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.