ఒక్కోసారి సినీ ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాకి పెట్టిన పేరే మరో సినిమాకి పెట్టుకొని సక్సెస్ అవుతూ ఉంటారు. అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. 1986 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా 118 సినిమాలు రిలీజ్ అయ్యి రికార్డుని క్రియేట్ చేశాయి. అదే సమయంలో తొలి 70 ఎమ్ ఎమ్ చిత్రంగా తెరకెక్కిన సింహాసనం చిత్రంతో కృష్ణ దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం కూడా ఘనవిజయాన్ని సాధించింది.
ఇక ఇవే కాకుండా ఆ సంవత్సరంలో మరెన్నో చిత్రాలు విజయాన్ని సాధించాయి. అలాగే ఏ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ,శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ఖైదీ రుద్రయ్య కూడా ఘనవిజయాన్ని అందుకుంది. అదే సంవత్సరంలో కె బాపయ్య దర్శకత్వంలో కృష్ణ,శ్రీదేవి సక్సెస్ జోడి కావడంతో వీరి కాంబినేషన్లో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం జయం మనదే రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
ఇదే జయం మనదే చిత్రం పేరుతో కృష్ణ తర్వాతి తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన మరో హీరో, ఇదే సినిమా టైటిల్ గా పెట్టుకొని ఘనవిజయాన్ని అందుకున్నాడు. అతను ఇంకెవరో కాదు విక్టరీ (Venkatesh) వెంకటేష్. 2000 సంవత్సరంలో ఎన్. శంకర్ దర్శకత్వం లో వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం జయం మనదేరా. ఈ చిత్రంలో వెంకటేష్,సౌందర్య,భాను ప్రియా హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి గాను వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించారు.
ఆహుతి ప్రసాద్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఏవీఎస్, ఝాన్సీ, రమాప్రభ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా రిలీజ్ అయ్యి అప్పటిలో బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.