ఒకరికొనకరు గౌరవించుకోవడం పెద్ద విషయమా… అలాగే చిరంజీవి కూడా ఓ దర్శకుడికి గౌరవం ఇచ్చి ఉంటారు. హెడ్డింగ్ చూసి మీరూ ఇలానే అనుకున్నారా. ఒకరినొకరు గౌరవించుకోవడం, గౌరవంగా పిలవడం, మాట్లాడటం కొత్త కాదు. కానీ వయసులో తన కంటే చిన్నవారైనా… ఆయన వృత్తికి, ప్రతిభకు గౌరవం ఇవ్వడం గొప్పే కదా. అందులోనూ టాలీవుడ్ సీనియర్ స్టార్, మేటి హీరోల్లో ఒకరైన చిరంజీవి ఇవ్వడం ఇంకా విషయమే కదా. రామ్‌చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో ఇటీవల సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే.
దానికి సంబంధించిన వీడియోను చిత్రబృందం సాయంత్రానికి విడుదల చేసింది. అందులో 2:10 నిమిషాల దగ్గర చూడండి మీకే తెలుస్తుంది. ఓ దర్శకుడికి చిరంజీవి ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడతారో తెలుస్తుంది. ఏంటి… ఆ వీడియో చూశారా. తనయుడు రామ్‌చరణ్ మీద క్లాప్‌నిచ్చాక ‘ఆల్ ది బెస్ట్ శంకర్ సర్’ అని అన్నారా? అదీ చిరంజీవి అంటే. శంకర్ తొలినాళ్లలోనే అంటే 1994లో చిరంజీవి కి కథ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే ‘ది జెంటిల్ మెన్’.
‘ది జెంటిల్‌మెన్’గా చిరంజీవి బాలీవుడ్‌కి వెళ్లారు. ఆ తర్వా తఈ ఇద్దరూ కలసి పని చేయడం ప్రేక్షకులకు చూడలేదు. ఇప్పుడ ఇన్నాళ్ల తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నారు. అప్పుడు యువ దర్శకుడు, ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడు. ఈలోపు చిరంజీవి కూడా అందనంత ఎత్తుకు ఎదిగారు.