Keedaa Cola: ‘కీడా కోలా’ కథ ఇదేనా.. ఆ హింట్ ఇచ్చేశారుగా..!

తరుణ్ భాస్కర్.. ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. చాలా తక్కువ బడ్జెట్లో తీసిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. పెట్టిన బడ్జెట్ కి 10 రెట్లు లాభాలను అందించింది. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే యూత్ ఫుల్ మూవీని తీశాడు. ఇది ఫస్ట్ రిలీజ్ లో అంతంత మాత్రమే ఆడింది. కానీ సెకండ్ రిలీజ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇది సేఫ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ థియేట్రికల్.. పరంగా హిట్ సినిమా అని చెప్పలేము. ఆ తర్వాత వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్టు సెట్ కాలేదు. అదీ కాక లాక్ డౌన్ రావడంతో తరుణ్ భాస్కర్ కి గ్యాప్ వచ్చింది. మొత్తానికి తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ అనే డిఫెరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు (Keedaa Cola) ట్రైలర్ ను కూడా లాంచ్ చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 54 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఇది కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే..

‘కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు?’ అనేది కథగా తెలుస్తుంది. ఇందులో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ కూడా ఓ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇది కొంత ఇంట్రెస్టింగ్ గాను… ఇంకొంచెం కంఫ్యూజింగ్ గాను ఉందని చెప్పొచ్చు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus