Nayanatara: నయన్ ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న హీరో ఎవరో తెలుసా?

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. హీరోయిన్ గా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార కెరియర్ మొదట్లో తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో డిస్టబెన్స్ వచ్చాయి అయితే ఈ డిస్టబెన్స్ నుంచి దూరంగా ఉండాలనుకున్నటువంటి ఈమె సినిమాలలో నటించడం తప్ప సోషల్ మీడియాకు అలాగే సినిమా ప్రమోషన్లకు కూడా దూరంగా ఉన్నారు.

సోషల్ మీడియాలో ఎక్కువగా నెగెటివిటీ ఉంటుందన్న కారణంతో ఇన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి నయనతార గురువారం ఇంస్టాగ్రామ్ లోకి అడుగు పెట్టారు. ఇలా ఈమె ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇస్తూ అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే నయనతార ఇంస్టాగ్రామ్ వేదికగా తన మొదటి పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. నయనతార తన ఇద్దరి కవల పిల్లలతో కలిసి ఉన్నటువంటి ఒక వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

ఇలా ఈమె (Nayanatara) ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టడంతో అతి తక్కువ సమయంలోనే ఈమెకు ఫాలోవర్స్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోతున్నారు. అదేవిధంగా నయనతార కూడా ఇప్పటివరకు కేవలం ఐదుగురిని మాత్రమే తన ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. మరి నయనతార ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నటువంటి ఆ ఐదుగురు ఎవరు అనే విషయానికి వస్తే అందులో తన భర్త విగ్నేష్ తో పాటు ఓన్ ప్రొడక్షన్ హౌజ్ రౌడీ పిక్చర్స్ ఖాతాలను నయనతార ఫాలో అవుతుంది.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, నటుడు షారుక్ ఖాన్ మిచెల్ ఒబామా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్ ను నయనతార ఫాలో అవుతోంది. ఇక ఈమె ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యే ఏకైక హీరో షారుక్ కావడం విశేషం. ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించినప్పటీకీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం తారక్ ను అనుసరిస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus