రవితేజ, శ్రీయ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాన్ శీను’.శ్రీహరి,కస్తూరి,అంజనా సుఖాని ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.వెంకట్ మరియు వి.సురేష్ రెడ్డిలు కలిసి నిర్మించారు. 2010వ సంవత్సరం ఆగష్ట్ 6న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ నే సొంతం చేసుకుని ఫుల్ రన్లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ చిత్రం విడుదలై 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది. రవితేజకి మాస్ రాజా అనే బిరుదుని అందించిన మూవీ ఇది. అలాగే ఇ.వి.వి.సత్య నారాయణ, శ్రీను వైట్ల, మురుగదాస్, మెహర్ రమేష్ వంటి డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా చేసిన గోపీచంద్ మలినేని ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు.
మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
4.02 cr
సీడెడ్
2.27 cr
ఉత్తరాంధ్ర
1.68 cr
ఈస్ట్
1.41 cr
వెస్ట్
1.05 cr
గుంటూరు
1.24 cr
కృష్ణా
1.01 cr
నెల్లూరు
0.66 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
13.34 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.72 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
15.06 cr
‘డాన్ శీను’ చిత్రానికి రూ.12.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.15.06 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకు రూ.2 కోట్ల పైనే లాభాలు దక్కాయన్న మాట.ఆ టైములో ‘ఆంజనేయులు’ ‘శంభో శివ శంభో’ వంటి చిత్రాల ఫలితాలతో ఢీలా పడిపోయిన రవితేజ.. ‘డాన్ శీను’ తో హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. అంతేకాదు రవితేజ-గోపీచంద్ మలినేని ల కాంబోలో ‘బలుపు’ క్రాక్’ వంటి మరో రెండు హిట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ‘క్రాక్’ తో వీళ్ళు హ్యాట్రిక్ ను కంప్లీట్ చేశారు.