యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు తారక్ నాలుగేళ్ల పాటు పరిమితం కావడంతో కెరీర్ పరంగా తారక్ కు గ్యాప్ వచ్చింది. ఈ ఏడాది తారక్ నటించిన సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. అయితే 2025 సంవత్సరం మాత్రం తారక్ అభిమానులకు మరింత స్పెషల్ గా ఉండనుంది.
2025 సంవత్సరంలో తారక్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వార్2 సినిమాతో పాటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కూడా 2025 సంవత్సరంలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. తారక్ ఫ్యాన్స్ కు 2025 డబుల్ ధమాకాగా ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో తారక్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తారక్ (Jr NTR) నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. తారక్ కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో సైతం నటించడానికి సిద్ధపడుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ సినిమాలతో పాటు క్లాస్ సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తారక్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
తారక్ పారితోషికం అంతకంతకూ పెరుగుతుండగా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకు సంబంధించి లాభాల్లో వాటా తీసుకోనున్నారని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాన్ వరల్డ్ హీరోగా ఎదగడంతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.