బేబీ బంప్‌తో కనిపించిన ‘దృశ్యం’ నటి ఎవరంటే..?

ఈ వెడ్డింగ్ సీజన్‌లో స్మాల్, సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీలంతా పెళ్లి పీటలెక్కుతున్నారు.. మంచి ముహూర్తం చూసుకుని తమ లవ్డ్ ఒన్స్‌ అనుకున్నవారితో ఏడడుగులు వేస్తున్నారు.. అలాగే పేరెంట్స్ కాబోతున్న వారు తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు.. ఇటీవలే యాంకర్ లాస్య రెండోసారి బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. ఇక బేబి బంప్, బేబి షవర్ ఫంక్షన్లకు సంబంధించి శుభవార్తలతో పలువురు సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు.. తాజాగా మరో నటి బేబి బంప్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది..

ఆ నటి ఇషితా దత్తా.. 2012 లో వచ్చిన ‘చాణక్యుడు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. బాలీవుడ్ ‘దృశ్యం’ లో చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ కూతురుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ అయిన ‘దృశ్యం’ తమిళం, తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో డబ్ అవగా.. హిందీలో ఇషితా తన నటనతో మెప్పించింది.. అలాగే 2022 లో వచ్చిన సీక్వెల్ ‘దృశ్యం 2’ లో కూడా నటించి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది..

రీసెంట్‌గా ఇషితా గురించి ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.. అదేంటంటే.. ఆమె త్వరలో తల్లి కాబోతుందట.. ఈ న్యూస్ నిజమే అన్నట్టు ఇషితా బేబి బంప్‌తో వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.. ఆమె బాంబో ఎయిర్ పోర్ట్‌లో కెమెరాల కంట పడింది.. ఆ సమయంలో ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నట్లు బేబీ బంప్ చూస్తే తెలుస్తోంది.. ఇక 2017 సంవత్సరంలో ఇషితా, వత్సల్ సేథ్‌ను వివాహం చేసుకుంది..

కాగా ఇషితా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఆమె కానీ ఆమె భర్త వత్సల్ కానీ కన్ఫమ్ చేయలేదు.. తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో కూడా ఈ విషయం గురించి పోస్ట్ చేయలేదు.. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. తల్లి కాబోతున్న ఇషితా దత్తాకు విషెస్ తెలియజేస్తున్నారు.. ఆమె రెస్పాండ్ అయితే కానీ దీని గురించి క్లారిటీ రాదు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus