భవిష్యత్తులో ‘మహాభారతం’ ను తెరకెక్కించాలి అనేది రాజమౌళి డ్రీమ్. అందుకోసమే ‘యమదొంగ’ ‘మగధీర’ ‘బాహుబలి'(సిరీస్) లను తెరకెక్కించి ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తున్నాడు. తద్వారా తెలుగు సినిమా మార్కెట్ ను కూడా పెంచాడు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అంటే అది బాహుబలి చలవే..! ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ గారు కూడా ‘రామాయణం’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను నిర్మించాలి అని ప్లాన్ చేసారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ చిత్రంగా దీన్ని నిర్మించాలి అనుకున్నారు. 3డి టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ ప్రాజెక్ట్ ను మూడు పార్టులుగా తెరకెక్కించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మధు మంతెన, నమిత్ మల్హోత్ర (ప్రైమ్ ఫోకస్)తో కలిసి అల్లు అరవింద్ గారు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాలి అనుకున్నారు. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ … రామాయణాన్ని డైరెక్ట్ చెయ్యబోతున్నట్టు వెల్లడించారు.1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను రూపొందించాలి అనుకున్నారు. అయితే అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఏడాది కావస్తున్నా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు నిర్మాతలు. ఇదిలా ఉండగా… అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకోవడానికి ప్రభాసే కారణం అని టాక్ మొదలైంది.
ఇటీవల ప్రభాస్ తన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఆది పురుష్’ గా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ కు ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకుడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. నిజానికి అల్లు అరవింద్ గారి రామాయణంలో కూడా ప్రభాస్ తో ఓ క్యారెక్టర్ చేయించాలి అనుకున్నారు. కానీ ‘రామాయణం’ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ప్రభాస్ ‘ఆది పురుష్’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇన్సైడ్ టాక్.
Most Recommended Video
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?