ఒకప్పుడు కన్నడ సినిమా అంటే ఎక్కువగా రీమేక్ లే ఉంటాయి అనే ముద్ర ఉండేది. కానీ ‘కె.జి.ఎఫ్'(సిరీస్) తర్వాత జనాల్లో ఆ నమ్మకం పోయింది. అక్కడ కూడా మంచి సినిమాలు రూపొందుతున్నాయి. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) తో ఆ ముద్ర చెరిగిపోయింది. ‘777 చార్లీ’ ‘విక్రాంత్ రోణ’ వంటి మంచి సినిమాలు కూడా వచ్చాయి. ఇక ఈ మధ్యనే ‘కాంతారా’ అనే సినిమా కూడా రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన ఈ మూవీ స్లోగా స్టార్ట్ అయినా బ్లాక్ బస్టర్ రన్ ను కొనసాగిస్తుంది.
ఆల్రెడీ ఈ మూవీ అక్కడ రూ.75 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. హిందీలో కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అక్కడ ఈ మూవీ 1200 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ ను సాధించడంలో విఫలమైంది. తొలిరోజు అక్కడ రూ.70 లక్షల నుండి రూ.1 కోటి మాత్రమే కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ పండితుల అంచనా..!
ఇక తెలుగులో కూడా ఈ మూవీ పెర్ఫార్మన్స్ అలానే ఉంది. క్రిటిక్స్ అంతా ఈ మూవీని ఆహా, ఓహో అంటూ 4/5 రేటింగ్ లు ఇస్తుంటే బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. చాలా చోట్ల జనాలు లేక మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి.అయితే ఈవెనింగ్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి.
హైదరాబాద్ లో ఏకంగా 44 శాతం ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. రేపు ఆదివారం కావడంతో ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తెలుగులో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.