Dulquer Salmaan: బాలయ్య- బాబీ కాంబో.. దుల్కర్ ఎంట్రీ వెనుక అంత కథ ఉందా?

  • November 18, 2023 / 02:49 PM IST

నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే ‘భగవంత్ కేసరి’ తో ఓ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక నెక్స్ట్ సినిమాని ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీతో చేయబోతున్నారు బాలయ్య. జూన్ 10 న అంటే బాలయ్య పుట్టినరోజు నాడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ సొంత బ్యానర్ అయిన ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌’ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ.. ఫస్ట్ షెడ్యూల్ ను ఫైట్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేశారు. ఈ మధ్య అది బాలయ్యకి ఓ సెంటిమెంట్ గా కూడా మారిపోయింది. ఇదిలా ఉండగా.. బాలయ్య- బాబీ సినిమాలో ఓ యంగ్ హీరో రోల్ కి స్కోప్ ఉందని అందుకోసం దుల్కర్ లేదా నానిని చిత్ర బృందం సంప్రదిస్తున్నట్టు ఫిల్మీ ఫోకస్ ఇది వరకే తెలిపింది. ఇక ఫైనల్ గా దుల్కర్ ఈ ప్రాజెక్టులో ఫైనల్ అయినట్టు సమాచారం.

‘వెంకీ మామ’ నుండి దర్శకుడు బాబీ కూడా చాలా వరకు మల్టీస్టారర్ల పైనే ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ ఏడాది అతని దర్శకత్వంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా ఓ మల్టీస్టారర్ లాంటి మూవీనే..! ఎందుకంటే అందులో రవితేజ కూడా ఓ హీరోగా నటించాడు. ఏదేమైనా బాలయ్య – (Dulquer Salmaan) దుల్కర్ కాంబో చాలా ఫ్రెష్ గా ఉంటుందని చెప్పొచ్చు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus