రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తో ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ బిసినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ఆల్ టైం టాప్ గ్రాస్సర్ గా ఉన్న బాహుబలి 2కి మించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ ఆర్ ఆర్ ఆర్ కి జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే డి వి వి దానయ్య లాభాలలోకి వెళ్లారు. ఐతే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం,, ఆయన్ని కలవరపెడుతున్న అంశం. ఈ ఏడాది జులై 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం జనవరి 8, 2021కి వాయిదా పడింది.
దీనితో ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ వ్యయం కూడా పెరుగుతూపోతుంది. ఇక అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ బ్రేక్ పడింది. దీనితో ఆర్ ఆర్ ఆర్ మళ్ళీ వెనక్కి వెళ్లడం ఖాయం అని ప్రచారం జరుగుతుంది. ఐతే ఈ పుకార్లపై స్పందించిన దానయ్య ఈ సారి చెప్పిన సమయానికి ఆర్ ఆర్ ఆర్ విడుదల ఉంటుంది అన్నారు. ఇప్పటికే చాల వరకు గ్రాఫిక్స్ వర్క్స్ కూడా పూర్తయింది మిగిలిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసి చెప్పిన టైం కి సినిమా రిలీజ్ చేస్తాం అని అన్నారు.
కాగా దానయ్య మాటలపై జనాలకు నమ్మకం పోయింది. గతంలో కూడా వీరు ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదాపడదు, జులై 30కి వస్తుందని పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అనూహ్యంగా రెండు నెలల క్రితం ఆర్ ఆర్ ఆర్ విడుదల 2021 జనవరి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా దానయ్య అదే మాట చెవుతున్నా, దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడి, లాక్ డౌన్ తీసేసే సూచనలు దగ్గరలో కనిపించడం లేదు. రెండు మూడు నెలలు షూటింగ్ కి బ్రేక్ పడితే ఆర్ ఆర్ ఆర్ చెప్పిన తేదీకి రావడం కష్టమే.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్