Eagle Collections: ‘ఈగల్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ‘ధమాకా’ తర్వాత ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో రవితేజ చేస్తున్న మూవీ ఇది. దీంతో ‘ఈగల్’ పై మంచి అంచనాలే ఉన్నాయి.ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ ,ట్రైలర్స్, పాటలు పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టుకున్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి అని చెప్పాలి.

కానీ వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్స్ తగ్గాయి.ఒకసారి ఫస్ట్ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.22 cr
సీడెడ్ 1.70 cr
ఉత్తరాంధ్ర 1.45 cr
ఈస్ట్ 0.96 cr
వెస్ట్ 0.59 cr
గుంటూరు 0.92 cr
కృష్ణా 0.60 cr
నెల్లూరు 0.45 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.89 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.05 cr
 ఓవర్సీస్ 1.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.24 cr (షేర్)

‘ఈగల్’ కి (Eagle) రూ. 22.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.22.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.13.24 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.9.06 కోట్ల షేర్ ను రాబట్టాలి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus