Edhuruga Nuvvunte Song: ఆకట్టుకుంటున్న ‘ఎదురుగా నువ్వుంటే’ లిరికల్ సాంగ్.!

‘స్వయంవరం’ ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav)  ‘మల్లీశ్వరి’ (Malliswari) ‘మన్మధుడు’ ‘ప్రేమ కావాలి’ (Prema Kavali) వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు కె.విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ సినిమాల్లో కామెడీ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు ఇప్పటికీ ప్రేక్షకుల్ని వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా పాటలు. ఇప్పటికీ చాలా మంది హమ్ చేసుకునే విధంగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆయన రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఈ క్రమంలో ఆయన తనయుడు శ్రీ కమల్ ను హీరోగా పెట్టి ‘ఉషాపరిణయం’ అనే క్యూట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుండి 3 పాటలు బయటకు వచ్చాయి. అన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. 4 వ పాటగా ఇప్పుడు ‘ఎదురుగా నువ్వుంటే’ అనే లిరికల్ సాంగ్ కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. 2 :32 నిమిషాల నిడివి కలిగి ఉంది.

‘ఎదురుగా నువ్వుంటే.. కుదురుగా లేనంతే పెదవిపై నీ పేరే కవితలా మారిందే’.. అంటూ మొదలైన ఈ పాట మెలోడీ ప్రియులని అమితంగా ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పవచ్చు. రఘురాం లిరిక్స్ అందించిన ఈ పాటని సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ కంపోజ్ చేసి పాడటం జరిగింది. ఒక్కసారి వినగానే ఎక్కేసే విధంగా ఈ పాట ఉంది అని చెప్పవచ్చు. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus