Reshma Rathore: సుప్రీంకోర్టు లాయర్ గా మారిన హీరోయిన్!

పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి తెలుగులో హీరోయిన్. సీరియల్స్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత త్రిష ఫ్రెండ్ గా ఓ సినిమాలో నటించి కెరీర్ స్టార్ట్ చేసింది. అదే యేడాది హీరోయిన్గా ఓ మూవీలో నటించే బంపర్ ఆఫర్ అందుకుంది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా అప్పట్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు వచ్చినా అవి సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు ఆమె ఏకంగా సుప్రీంకోర్టులో లాయర్ గా ప్రమోషన్ పొందింది.

మరి ఆ హీరోయిన్ ఎవరో ?మీరు గుర్తుపట్టారా ఆమె పేరు రేష్మా రాథోడ్. వెంకటేష్ – త్రిష జంటగా నటించిన బాడీగార్డ్ సినిమాలో హీరోయిన్‌కి ఫ్రెండ్ గా రేష్మ నటించినది. అదే ఏడాది రిలీజ్ అయిన ఈ రోజుల్లో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కథానాయక తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేదు. ఈ రోజుల్లో తర్వాత జైశ్రీరామ్ – లవ్ సైకిల్ – ప్రతిఘటన – జీలకర్ర బెల్లంతో పాటు మ‌రో త‌మిళ‌, మ‌ళ‌యాళ సినిమాలలో కూడా నటించింది.

ఈ సినిమాలో ఆమెకు  (Reshma Rathore) కలిసి రాలేదు. దీంతో 2017 తర్వాత ఆమె నటనకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బిజెపిలో చేరి ఖ‌మ్మం జిల్లా వైరా నుంచి అసెంబ్లీకి కూడా పోటీ చేసింది. దీంతోపాటే లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది. నటిగా పెద్ద పేరు తెచ్చుకోలేకపోయిన రేష్మ పొలిటికల్ గా లాయర్ గా మాత్రం తనదైన మార్క్ చూపిస్తోంది.

ఇటీవల సుప్రీంకోర్టు లాయర్ గా పదోన్నతి పొందింది. అప్పట్లో ఒకలా ఉన్న రేష్మ ఇప్పుడు చాలావరకు మారిపోయి కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆమెను చూసినవారు ఎవరూ కూడా ఆమె తెలుగులో ఒకప్పటి హీరోయిన్ అని గుర్తుపట్టలేక పోతున్నారు. ఏది ఏమైనా ఓ తెలుగు హీరోయిన్ సుప్రీంకోర్టులో లాయర్ కావడం గ్రేట్ అని చెప్పాలి.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus