‘కృష్ణ వ్రింద విహారి’ రెండో పాట కూడా సూపర్ హిట్టే..!

‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ‘శంకర్ ప్రసాద్ మూల్పూరి’ నిర్మాణంలో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్-కామ్ ఎంటర్టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ మూవీ మే 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.ఆల్రెడీ ప్రమోషన్స్‌ ను కూడా వేగవంతం చేసింది చిత్ర బృందం.ఇందులో భాగంగా విడుదల చేసిన మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యింది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

తాజాగా ఈ చిత్రం నుండీ రెండో పాటగా ‘ఏముందిరా’ అనే పాటని విడుదల చేశారు.వినడానికి ఈ పాట చాలా క్యాచీగా ఆహ్లాదకరంగా ఉందని చెప్పాలి.హరిచరణ్ చాలా ఎంజాయ్ చేస్తూ ఈ పాటని పాడారు. హర్ష అందించిన సాహిత్యం కూడా హైలెట్ అని చెప్పాలి. హీరో తను ప్రేమించిన అమ్మాయి యొక్క అందాన్ని వర్ణిస్తూ ఈ పాటలో చిందులేసినట్టు స్పష్టమవుతుంది.లిరికల్ వీడియో చూస్తుంటే ఈ పాటలో హీరో శౌర్య.. హీరోయిన్ షిర్లీని అగ్రహారానికి తీసుకువచ్చినట్లు, అక్కడ ఆమె చీర ధరించి ట్రెడిషినల్ గా మారినప్పుడు హీరో ఆమెతో ఓ డ్యూయెట్ వేసుకుంటాడు.

హల్దీ ఫంక్షన్ నుండి మొదలుకొని ఆమెని పెళ్లి చేసుకోవడం, బేబీ షవర్ జరపడం, పిల్లల్ని కనడం ఇలా హీరో ఇమాజినేషన్ తో ఈ పాటని చాలా బాగా చిత్రీకరించారు. విజువల్స్‌ బాగున్నాయి. కొరియోగ్రఫీ చక్కగా ఉంది.ఇక రాధిక శరత్‌కుమార్, బ్రహ్మాజీ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!


కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Share.