ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి హయ్యస్ట్ మూవీస్ ప్రొడ్యూస్ చేయకపోయినా.. మార్కెట్ పరంగా విపరీతమైన ఎక్స్ పోజర్ ఉన్నది మాత్రం బాలీవుడ్ కి మాత్రమే. మన జాతీయ భాష హిందీ కావడం, ప్రపంచవ్యాప్తంగా హిందీ తెలిసిన అర్ధమయ్యే ప్రేక్షకులు ఎక్కువగా ఉండడంతో.. మారుమూల గ్రామాల్లోనూ హిందీ సినిమాలు ఒకటీ ఆరా థియేటర్లలో ఆడుతూనే ఉంటాయి. అలాంటిది ఈ ఏడాది బాలీవుడ్ లో హిట్ పర్సెంట్ అనేది కనీసం 20% కూడా లేకపోవడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ మొదలుకొని హీరోలందరూ హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళు నటించిన సినిమాలన్నీ వరుస పరాజయాలు పొందడంతో బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మన తెలుగు సినిమా అయిన “బాహుబలి” తప్ప మరో చిత్రమేదీ కనీస స్థాయిలో నిలవలేకపోయింది.
పోనీ.. కింగ్ ఖాన్ షారుక్ అయినా తన తాజా చిత్రం “జబ్ హ్యారీ మెట్ సీజల్”తో ఏమైనా కాపాడతాడేమో అనుకొంటే.. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు కనీసం 30 కోట్ల రూపాయలు వసూలు చేయలేక షారుక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమైంది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ ఆశలన్నీ అక్షయ్ కుమార్ తాజా చిత్రం “టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ”పైనే పెట్టుకొంది. బాలీవుడ్ కి ప్రస్తుతం ద్రావిడ్ లా స్టాండర్డ్ హిట్స్ తో నిలబెడుతున్న అక్షయ్ పైనే పెట్టుకొంది. మరి ఆయన ఏం చేస్తాడో తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకూ వేచి చూడాల్సిందే..!!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.