‘భీష్మ’ తర్వాత నితిన్ కి సరైన సక్సెస్ పడలేదు. ‘రంగ్ దే’ కొంత వరకు పర్వాలేదు అనిపించినా.. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అది యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ‘మాస్ట్రో’ ఓటీటీకి వెళ్ళింది కాబట్టి.. దాని ఫలితం ఏంటో తెలీదు అని ఇటీవల నితిన్ కూడా ఓపెన్ గా చెప్పేశాడు. ఇక ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఏడాది గ్యాప్ తీసుకుని ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు నిఖిల్.
డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఆల్రెడీ కొంతమంది ఇండస్ట్రీ పెద్దలకి ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా స్పెషల్ షోలు వేయడం జరిగింది. సినిమా చూశాక వారు పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ కామెడీతో చాలా సరదాగా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ వద్ద ఓ ట్విస్ట్ ఉంటుందని., అది సర్ప్రైజింగ్ గా ఉన్నా… లేకపోయినా.. ఇంటర్వెల్ బ్లాక్ కి బాగా సింక్ అయ్యింది అంటున్నారు.
ఇక సెకండ్ హాఫ్ .. కథ వేరే టర్న్ తీసుకుంటుంది అంటున్నారు. ఈ క్రమంలో కొంత రొటీన్ గా అనిపిస్తుంది అని కూడా వారు చెబుతున్నారు. అయితే రాజశేఖర్ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది అని చెబుతున్నారు. నితిన్, రాజశేఖర్..ల పాత్రలకి మంచి మార్కులు పడతాయాట. హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా చూడటానికి బాగున్నాయని అంటున్నారు.
రావు రమేష్, సంపత్..ల కామెడీ కూడా ఆకర్షిస్తుందట. కానీ హీరోయిన్ శ్రీలీల పాత్ర పెద్దగా ఇంప్రెసివ్ గా లేదు అంటున్నారు. మొత్తంగా ఈ వీకెండ్ కి ఒకసారి ఈ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ని ట్రై చేయొచ్చు అనే టాక్ అయితే ఎక్కువగా చెబుతున్నారు. మరి డిసెంబర్ 8 న మార్నింగ్ షోల నుండి ఇలాంటి టాక్ వినిపిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.