విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కలయికలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2’ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాత దిల్ రాజుకి ఈ మూవీ రూ.50 కోట్ల వరకు లాభాలను అందించింది. ఇది థియేట్రికల్ పరంగా మాత్రమే.. నాన్ థియేట్రికల్ కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉంటుంది.ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మే 27న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.
ప్రమోషన్లను ఆల్రెడీ చిత్ర బృందం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన తమ్మిరాజు గారు పాల్గొన్న మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ” ‘ఎఫ్ 2’ లో పెళ్లి,ఆ తర్వాత వచ్చే కష్టాలు .. ఇలా వినోదాత్మకంగా చూపించాం. ‘ఎఫ్ 3’ మాత్రం డబ్బు చుట్టూ తిగిరే కథ. మానవ సంబంధాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఈ పాయింట్ ‘ఎఫ్ 3’ లో చాలా ఫన్ ఫుల్ గా చూపించడం జరిగింది.
‘ఎఫ్ 2’ కి ఫ్రాంచైజ్ గా వస్తున్న సినిమా ఇది. ఎఫ్ 2 క్యారెక్టర్లు ఉంటాయి కానీ ‘ఎఫ్ 3’ కథ పూర్తి భిన్నంగా ఉంటుంది. లీడ్ క్యారెక్టర్లను తీసుకొని కథని కొత్తగా చెప్పాం.కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడిగారి సినిమాల్లో అన్ని కామెడీ పంచులు బాగుంటాయి. దానిలో ఏది ట్రిమ్ చేయలన్నా కష్టంగా ఉంటుంది. ఐతే ఓవరాల్ ఫ్లో తీసుకొని కథకు ఏది అవసరమో అదే ఉంచుతాం. దిల్ రాజు గారి సినిమా అంటే ఎడిటర్ కు ఎక్కువ పని ఉంటుంది అని అంతా అనుకుంటారు.
ఆయన అద్భుతమైన నిర్మాత. సినిమా అంటే ఆయనకు ప్రేమ. సినిమాని చాలా జాగ్రత్తగా చూస్తారు. అయితే దిల్ రాజు గారి బ్యానర్లో దర్శకుడు అనిల్ రావిపూడితో ఎక్కువగా పని చేయడం అనిల్ గారే కరెక్షన్స్ చూసుకుంటారు.నేను బాహుబలి 2 వంటి పాన్ ఇండియా సినిమాకి పని చేశా. రాజమౌళి గారు క్రెడిట్ ఇచ్చారు. అన్ని భాషలు తెలిసిన ఎడిటర్ అయితే బావుంటుందని పాన్ ఇండియా సినిమాల మేకర్స్ భావిస్తారు.’ఎఫ్2′ కి మించి ‘ఎఫ్3’ ని డబుల్ ఎంజాయ్ చేస్తారు.
సూపర్ హిట్ పక్కా.’ఎఫ్ 4′ కూడా ఉంటుందా ? అని కొంతమంది అడుగుతున్నారు. అయితే దాని గురించి ఇంకా అనుకోలేదు. ఐతే ఈ ఫ్రాంచైజీ మాత్రం కొనసాగుతుంది” అంటూ తమ్మిరాజు చెప్పుకొచ్చారు.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!