F3 OTT: క్రేజీ ఓటీటీ ఆఫర్.. వదులుకున్న ‘ఎఫ్3’ మేకర్స్!

రీసెంట్ గా విడుదలైన ‘ఎఫ్3’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ మధ్యకాలంలో అన్నీ సీరియస్ తరహా సినిమాలే రావడంతో ‘ఎఫ్3’కి బాగా కలిసొచ్చింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ ని అన్ని వర్గాల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. మెహ్రీన్, తమన్నా, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా కనిపించారు.

మే 27న విడుదలైన ఈ సినిమా చాలా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుందనే వార్తలు హల్చల్ చేయగా.. చిత్రబృందం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ‘ఎఫ్3’ ఎనిమిది వారాల తరువాతే ఓటీటీలోకి వస్తుందని చెప్పారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. మంచి రేటుకే ఈ హక్కులను అమ్మారు దర్శకనిర్మాతలు.

అయితే ఈ సినిమా ముందుగానే ఓటీటీలో ప్రసారం చేసుకోవడానికి సోనీ సంస్థ రూ.12 కోట్లు అదనంగా ఆఫర్ చేసిందట. కానీ దానికి దర్శకనిర్మాతలు ఒప్పుకోలేదట. పన్నెండు కోట్ల ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఓటీటీలో ముందుగానే సినిమాను ప్రసారం చేస్తే.. థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు లైట్ తీసుకుంటారు.

అందుకే నిర్మాతలు దిల్ రాజు ఈ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. అంతేకంటే ఎక్కువ సినిమా థియేటర్లో ఆడితే సంపాదించుకోవచ్చని చూస్తున్నారు. అయితే గత వారంలో విడుదలైన ‘మేజర్’, ‘విక్రమ్’ రెండు సినిమాలు హిట్ కావడంతో ‘ఎఫ్3’కి కలెక్షన్స్ పరంగా ఎఫెక్ట్ పడుతోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus