Samantha Song: సమంత ఐటమ్‌ సాంగ్‌ పాడిన ఇంద్రవతి చౌహాన్ ఎవరో తెలుసా?

గతంలో ఎప్పుడూ లేని విధంగా అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా ఈ సినిమా అంతకుమించి అనేలా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని అభిమానులు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక మిగతా భాషల్లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియదు కానీ తెలుగులో మాత్రం భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు.

ఇక సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. సినిమాకు సంబంధించిన పాటలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు దేవిశ్రీప్రసాద్ చేసిన ప్రతి పాట కూడా అభిమానుల్లో మంచి నమ్మకాన్ని క్రియేట్ చేసింది. తప్పకుండా సినిమాలోని పాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అర్థమవుతుంది. ఇప్పుడు స్పెషల్ ఐటమ్స్ సాంగ్ కూడా విడుదల చేశారు.

సుకుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఐటెం సాంగ్ తప్పనిసరిగా ఉంటుంది అని అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప సినిమాలో అంటావా ఊ ఉ అంటావా అంటూ పాటను క్రియేట్ చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను పడింది మరెవరో కాదు. సింగర్ మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహన్. ఆమె బోల్ బేబీ బోల్ వంటి సింగింగ్ షోలలో కూడా అప్పట్లో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ తో కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది.

జార్జిరెడ్డి సినిమాలో కూడా ఆమె ఒక పాట పాడింది. ఇప్పుడు పుష్ప సినిమాలో ఏకంగా ఐటమ్ సాంగ్ పడడంతో అందరి ఫోకస్ అమెపైనే పడుతుంది. ఇలాంటి పాటను పాడడం కూడా అంత ఈజీ కాదు అని అర్థమవుతుంది. మరి ఈ పాటతో ఆమె ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus