‘ఒకటి తగ్గింది పుష్పా.. పార్టీ లేదా పుష్పా’ అంటూ ‘పుష్ప’రాజ్‌కు దాదాపు సమానంగా ‘పుష్ప’ (Pushpa) సినిమాల్లో అలరించాడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil). ఆ పాత్రకు తాను మాత్రమే సరిపోతాడు అని అనుకునేంతలా తన నటనతో మెప్పించాడు. ఇప్పటికీ ఆ వాయిస్, లుక్ మన మనసులో ముద్రించుకుపోయాయి. అలాంటి పాత్రను ఫహాద్‌కి కాకుండా వేరే హీరోకి చెప్పారని తెలుసా? అందులోనూ ఆ హీరో టాలీవుడ్ నటుడు అని తెలుసా? అవును ఆ హీరోనే ఈ విషయం చెప్పుకొచ్చారు.
‘భైరవం’ (Bhairavam) సినిమా ప్రచారంలో భాగంగా నారా రోహిత్ (Nara Rohith) గత కొన్ని రోజులుగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతున్నప్పుడు ‘పుష్ప’ సినిమాలోని భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ప్రస్తావన వచ్చింది. ఆ పాత్ర కోసం మైత్రీ మూవీ మేకర్స్ తొలుత నారా రోహిత్‌నే సంప్రదించారట. దానికి ఆయన కూడా కూడా సుముఖంగానే రియాక్ట్ అయ్యారట. అయితే ఆ తర్వాత సినిమా స్పాన్ పెరగడం లాంటి కారణాల వల్ల మలయాళ సినిమా నుండి ఫహాద్ ఫాజిల్ వచ్చారట.
‘రౌడీఫెలో’ సినిమాలోని నటనను చూసి షెకావత్ పాత్ర కోసం నారా రోహిత్‌ను సంప్రదించారని టాక్. ఆ సినిమాలో రోహిత్ క్యారెక్టర్‌లో చిన్న నెగిటివ్ షేడ్ ఉంటుంది. ‘పుష్ప’ సినిమాలోనూ షెకావత్ పాత్ర అలానే ఉంటుంది. అందుకే తొలుత రోహిత్‌ను కాంటాక్ట్ అయ్యారట. కానీ వర్కవుట్ కాలేదు. అయ్యి ఉంటే టాలీవుడ్‌లో ఓ డిఫరెంట్ కాంబో సెట్ అయి ఉండేది. షెకావత్ యాటిట్యూడ్‌ను రోహిత్ చేసుంటే పీక్స్ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ‘భైరవం’ సినిమా గురించి చూస్తే మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్, బెల్లకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 30న సినిమాను విడుదల చేస్తున్నారు. ‘గరుడన్’ సినిమాకు ఇది రీమేక్. అయితే మార్పులు చేశామని టీమ్ చెబుతోంది.