Samantha: ప్రతిసారి సమంత వివరణ ఇచ్చుకోవాలా?

సమంతను దగ్గరినుంచి చూసిన వాళ్లు ఆమె గురించి చాలా గొప్పగా చెబుతారు. హీరోయిన్ గా పాపులారిటీ ఉన్న సమంత అటు వ్యాపారవేత్తగా క్రేజ్ ను పెంచుకుంటూనే మరోవైపు సేవా కార్యక్రమాల ద్వారా కష్టాల్లో ఉన్నవాళ్లకు తన వంతు సాయం చేస్తున్నారు. నాగచైతన్యతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన సమంతపై ఎన్నో ఫేక్ వార్తలు ప్రచారంలోకి వచ్చినా చాలా సందర్భాల్లో ఆమె మౌనం వహించారు. యశోద సినిమా ప్రమోషన్స్ సమయంలో సమంత మయొసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సమంత మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. సమంత సోషల్ మీడియాలో సైలెంట్ కావడంతో ఆమె గురించి మూడు రోజులకు ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం గమనార్హం. వ్యాధి చికిత్స కోసం సమంత విదేశాలకు వెళ్లారని కొన్నిరోజుల క్రితం ప్రచారం జరగగా తాజాగా సమంత సినిమాలకు గుడ్ బై చెబుతున్నారని ప్రచారం జరిగింది. తన సినీ కెరీర్ కు, వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది

కలిగేలా వస్తున్న వార్తలకు సంబంధించి ఈ మధ్య కాలంలో సమంత ప్రతి సందర్భంలో తన టీమ్ ద్వారా వైరల్ అయిన వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇస్తున్నారు. బాలీవుడ్ ప్రాజెక్ట్ ల నుంచి సమంత వైదొలగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సమంత మేనేజర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సమంతను హర్ట్ చేసేలా ఫేక్ న్యూస్ వైరల్ చేయవద్దని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రేక్షకులకు తెలియాల్సిన సమాచారం ఉంటే

సమంత సోషల్ మీడియా ద్వారా చెబుతారని ఆమెను ఇబ్బంది పెట్టేలా కథనాలను ప్రచారంలోకి తీసుకురావద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. సమంతపై ఫేక్ న్యూస్ రాయాల్సినంత పగేంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సమంతపై నెగిటివ్ ప్రచారం ఆపాలని ప్రతిసారి సమంత వివరణ ఇచ్చే పరిస్థితి తీసుకురావద్దని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత సమంత రెగ్యులర్ షూటింగ్ లతో బిజీ కానున్నారని తెలుస్తోంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus