ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న “రారండోయ్ వేడుక చూద్దాం”
- May 29, 2017 / 01:41 PM ISTByFilmy Focus
అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో నాగార్జున నిర్మించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ శుక్రవారం రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమాని కుటుంబ వాతావరణం.. పల్లెటూరు అందాలతో ప్రతి ఫ్రేమ్ ని చాలా అందంగా తీర్చిదిద్దారని దర్శకుడు కల్యాణ్ కృష్ణ అభినందనలు అందుకుంటున్నారు. సినిమా ఫస్టాఫ్ లో శివ, భ్రమరాంబల మధ్య సన్నివేశాలు చాలా సరదాగా సాగి ఆహ్లాదాన్ని పంచుతోందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.
సెకండాఫ్ లో అటు తండ్రి, ఇటు ప్రేమించిన వ్యక్తి మధ్య సంఘర్షణకు గురైన ఓ అమ్మాయి కథను, ఎమోషనల్ సన్నివేశాలతో కంటతడి పెట్టించారు. మాస్ ప్రేక్షకులకు నచ్చే యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను “రారండోయ్ వేడుక చూద్దాం” ఆకర్షిస్తోంది. ప్రేమమ్ తర్వాత నాగచైతన్య మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















