Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సెట్స్ లో అలా ఉంటారట!

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ స్థాయిలో క్రేజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. టాలీవుడ్ యువ హీరోలతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా పవన్ ను అభిమానించే సెలబ్రిటీలు ఉన్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అయితే పవన్ ను ఏకంగా దైవంతో సమానంగా కొలుస్తారు. తాజాగా ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ తో పాటు పలు సినిమాలతో పాపులారిటీని సంపాదించుకున్న రవీంద్ర విజయ్ పవన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రవీంద్ర విజయ్ నటించారు. పవన్ హీరోగా తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో ఛాన్స్ కొట్టేసిన రవీంద్ర విజయ్ పవన్ చాలా ప్రొఫెషనల్ అని పొరపాటున కూడా ఎవరినీ బాధ పెట్టని స్వభావం పవన్ కళ్యాణ్ దని రవీంద్ర విజయ్ అన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఒకేలా పవన్ ట్రీట్ చేస్తారని రవీంద్ర విజయ్ తెలిపారు.

టైమ్, ఖచ్చితత్వం గురించి పవన్ ఎంతగానో ఆరాట పడతారని పవన్ గొప్పదనం గురించి రవీంద్ర విజయ్ వెల్లడించారు. షూటింగ్ టైమ్ లో పవన్ లో ఉన్న కరాటే కళాకారుడు ప్రతిబింబిస్తాడని రవీంద్ర విజయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ పూర్తైన తర్వాత హరీష్ శంకర్ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొననున్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Share.