ఇండియన్ వెబ్ సిరీస్‌ల్లో ది బెస్ట్ అంటూ ఓ లిస్ట్ రాసినా, ఎక్కువమంది చూశారు అంటూ ఓ లిస్ట్ రాసినా, ఎవరికైనా ఓ సిరీస్ షేర్ చేయాలి అని చెప్పడానికి ఓ లిస్ట్ రాసినా అందులో కచ్చితంగా ఉండే వెబ్‌సిరీస్‌లు ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కచ్చితంగా ఉంటాయి. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. అలాంటి ఫేమస్ వెబ్ సిరీస్‌కు మూడో సీజన్ సిద్ధమవుతోంది. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది అని సమాచారం. ఈ సిరీస్ స్ట్రీమింగ్ విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది.
‘పాతాళ్‌లోక్ 2’ వెబ్‌సిరీస్‌లో తన నటనతో ఆకట్టుకున్న జైదీప్ అహ్లావత్.. ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ (Family Man 3) సిరీస్‌లో కనిపించనున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన ఈ సిరీస్‌లో చేరారు. ఆయనే ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్‌సిరీస్‌ను ఎప్పుడు స్ట్రీమ్ చేస్తారు అనేది చెప్పారు. నవంబర్ నుండి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తుందట. అయితే పక్కా డేట్ అయితే ఇంకా బయటకు రాలేదు.
‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ 2019లో సెప్టెంబరు 20న స్ట్రీమింగ్‌కి తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2021లో జూన్ 4న రెండో సీజ్‌ను తీసుకొచ్చారు. ఇప్పుడు మూడో సీజన్ నాలుగేళ్ల తర్వాత నవంబరులో తీసుకొస్తున్నారు. ఈ సీజన్‌తోనే ఈ సిరీస్ ముగిసిపోతుంది అని సమాచారం.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత (Samantha) ప్రతినాయకురాలిగా నటిచంగా.. ఇప్పుడు జైదీప్ అహ్లావత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. నవంబరు అంటే కనీసం రెండు నెలల ముందు నుండి అంటే సెప్టెంబరు నుండి సిరీస్ ప్రచారాన్ని స్టార్ట్ చేస్తారు. కాబట్టి అప్పుడు మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.