Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Reviews » Robinhood Review in Telugu: రాబిన్ హుడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Robinhood Review in Telugu: రాబిన్ హుడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 28, 2025 / 08:40 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Robinhood Review in Telugu: రాబిన్ హుడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నితిన్ (Hero)
  • శ్రీలీల (Heroine)
  • డా.రాజేంద్రప్రసాద్‌,వెన్నెల కిశోర్ , బ్రహ్మాజీ,మైమ్ గోపి ,లాల్, డేవిడ్ వార్నర్,శుభలేఖ సుధాకర్ (Cast)
  • వెంకీ కుడుముల (Director)
  • నవీన్‌ యెర్నేని , వై.రవిశంకర్‌ (Producer)
  • జి.వి.ప్రకాశ్‌కుమార్‌ (Music)
  • సాయిశ్రీరామ్‌ (Cinematography)
  • Release Date : మార్చి 28, 2025
  • మైత్రీ మూవీమేకర్స్‌ (Banner)

దాదాపు నాలుగు నెలలపాటు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు నేడు (మార్చ్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “రాబిన్ హుడ్”(Robinhood). “భీష్మ” (Bheeshma) అనంతరం వెంకీ కుడుముల (Venky Kudumula)  -నితిన్ (Nithiin) కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడం, నితిన్ & వెంకీకి కెరీర్లకు ఈ సినిమా హిట్ అవ్వడం కీలకమవ్వడంతో “రాబిన్ హుడ్” సినిమా చాలా స్పెషల్ అయిపోయింది. “అదిదా సర్ప్రైజు & డేవిడ్ వార్నర్” కారణంగా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం అనుకోని విధంగా నాలుగు సినిమాలతో పోటీగా విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!

Robinhood Review

Robinhood Movie Review and Rating

కథ: చిన్నప్పుడే మనుషుల్లో కామన్ లక్షణం మోసం చేయడం అని అర్థం చేసుకున్న రామ్ (నితిన్). పదిమందికి మంచి చేయడం కోసం ఒకర్ని మోసం చేయడంలో తప్పేం లేదనే విధంగా పెరుగుతాడు. అందుకే రాబిన్ హుడ్ గా మారి అనాథలకు, అనాథ శరణాలయాలకు అండగా నిలుస్తాడు. ఇండియన్స్ అందరూ బ్రదర్స్ & సిస్టర్స్ గా భావించే రామ్ కి ఎన్నారై నీర (శ్రీలీల) (Sreeleela) ఒక మిషన్ లో భాగంగా పరిచయమై.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

అయితే.. సామి (దేవ్ దత్త నాగ్) కథలోకి వీళ్లందరూ అనుకోకుండా ఎంటర్ అవుతారు. సామి ఎవరు? అతని ధ్యేయం ఏంటి? రామ్ & నీర అతని కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వాటిని ఎలా జయించారు? అనేది “రాబిన్ హుడ్” కథాంశం.

Robinhood Movie Review and Rating

నటీనటుల పనితీరు: నితిన్ ఈ తరహా పాత్రలు ఇప్పటికే పలుమార్లు చేసి ఉండడంతో.. అతనికి ఈ పాత్ర కేక్ వాక్ లా అయిపోయింది. చాలా ఈజ్ తో రామ్ పాత్రలో ఒదిగిపోయాడు. క్యారెక్టరైజేషన్ ఇంకాస్త కొత్తగా ప్రాజెక్ట్ చేసి ఉంటే బాగుండేది. శ్రీలీల నటించగలదు అని ప్రూవ్ చేసుకుంది కానీ.. ఆమె క్యారెక్టరైజేషన్ సరిగా వర్కవుట్ అవ్వలేదు. కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేసి కానీ అది కూడా సరిగా పండలేదు. వెన్నెలకిషోర్ (Vennela Kishore), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కాంబినేషన్ మాత్రం మంచి కామెడీ క్రియేట్ చేసి ప్రేక్షకుల్ని నవ్వించింది.

దేవ్ దత్త నాగ్ కి (Devdatta Nage) ఎందుకో సౌత్ సరిగా అచ్చిరాలేదు. అతడు నటించిన “ఆదిపురుష్ (Adipurush), దేవకీనందన వాసుదేవ” (Devaki Nandana Vasudeva) ఇప్పుడు “రాబిన్ హుడ్”లో కూడా అతని క్యారెక్టర్ ఎందుకో సరిగా ఎలివేట్ అవ్వలేదు. షైన్ టామ్ చాకో (Shine Tom Chacko), మైమ్ గోపి, లాల్, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ తమ టెంప్లేట్ రోల్స్ లో పర్వాలేదనిపించుకున్నారు.

Robinhood Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ ఎప్పుడూ గ్రాండ్ & బ్రైట్ గా ఉంటుంది. లిమిటెడ్ అండ్ తక్కువ బడ్జెట్ లో కూడా మంచి అవుట్ పుట్ ఇవ్వగల సినిమాటోగ్రాఫర్ ఈయన. యాక్షన్ బ్లాక్ కోసం కాస్త ఎక్కువ ఖర్చు చేశారు అనిపించినప్పటికీ.. కాస్త డిఫరెంట్ గా ట్రై చేశాడు. జీవి ప్రకాష్ కుమార్ పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. అయితే సదరు పాటల ప్లేస్మెంట్ మాత్రం ఎందుకో సెట్ అవ్వలేదు. “గాంజా మ్యాన్” అనే రీమిక్స్ సాంగ్ మాత్రం ఆ ఫైట్ సీన్స్ కి మంచి వెల్యూ యాడ్ చేసింది.

ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు నిర్మాతలు. సినిమాకి కావాల్సినదానికంటే ఎక్కువ ఖర్చు చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల తన సేఫ్ జోన్ లో నుంచి బయటికి వచ్చి తీసిన సినిమా ఇది. ఒక రొటీన్ టెంప్లేట్ సినిమాను యాక్షన్ & సస్పెన్స్ థీమ్ లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. వెన్నెల కిషోర్ & రాజేంద్రప్రసాద్ పాత్రలతో నవ్వించడం వరకు సక్సెస్ అయినప్పటికీ.. ఓవరాల్ గా ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. అందువల్ల కామెడీ అక్కడక్కడా పండినా, పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

Robinhood Movie Review and Rating

విశ్లేషణ: అస్తమానం కొత్త కథలు దొరకవు, అందుకే పాత కథలను కొత్తగా చెప్పడం మొదలెట్టారు దర్శకులు. వెంకీ కుడుముల కూడా తన తొలి రెండు సినిమాల్లో చేసింది అదే. రెగ్యులర్ సినిమాలకు చిన్నపాటి ట్రెండీ ట్రీట్మెంట్ అద్దే హిట్స్ కొట్టాడు వెంకీ కుడుముల. అలాంటిది తన మూడో సినిమా, అది కూడా చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా విషయంలో మాత్రం ఆ కొత్త తరహా ట్రీట్మెంట్ ఇవ్వడంలో తడబడ్డాడు. అందువల్ల “రాబిన్ హుడ్” చాలా తక్కువగా నవ్వించి, ఓ మోస్తరు సినిమాగా మిగిలిపోయింది.

Robinhood Movie Review and Rating

ఫోకస్ పాయింట్: రొటీన్ రాబిన్!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Robinhood
  • #Sreeleela
  • #Venky Kudumula

Reviews

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sreeleela: ‘దేఖ్‌లేంగే సాలా’.. బాగుంది కానీ.. శ్రీలీల డ్యాన్సెక్కడ మాస్టారూ.. సైడ్‌ చేశారేంటి?

Sreeleela: ‘దేఖ్‌లేంగే సాలా’.. బాగుంది కానీ.. శ్రీలీల డ్యాన్సెక్కడ మాస్టారూ.. సైడ్‌ చేశారేంటి?

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

trending news

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అఖండ 2’

12 hours ago
Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా, హీరోయిన్ షగ్న శ్రీ దర్శకత్వంలో మూవీ పోస్టర్ రిలీజ్

వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా, హీరోయిన్ షగ్న శ్రీ దర్శకత్వంలో మూవీ పోస్టర్ రిలీజ్

10 hours ago
Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

1 day ago
Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

1 day ago
Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

1 day ago
Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version