పెద్ద సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతుంది. అంత మొత్తం వెనక్కి తిరిగొస్తుందా? లేదా? అనేది ఆలోచించకుండా బయ్యర్స్ ఎగబడి ఆ సినిమా రైట్స్ ను తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ నిర్మాత ఎక్కువ రేటు చెబితే.. దానికి కొంత వెనక్కి ఇచ్చేలా అగ్రిమెంట్లు రాయించుకుంటారు బయ్యర్స్. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ నష్టం వస్తే.. వాళ్ళు మరింత నష్టపరిహారం డిమాండ్ చేసే ఛాన్స్ ఉండదు. గతంలో తమ సినిమా కనుక ఆడకపోతే కొంతమంది పెద్ద హీరోలు డబ్బులు వెనక్కి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
కానీ కచ్చితంగా చేయాలి అనే లెక్క ఏమీ ఉండదు. కొంతమంది బయ్యర్స్ కి అండగా నిలబడటానికి తీసుకున్న స్టెప్ అది.. అంతే..! కానీ దీని వల్ల ఇబ్బందులు కూడా పెరిగాయి. ‘ఎందుకంటే.. ఆ హీరో సినిమా ఆడకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చాడు.. మీరు కూడా వెనక్కి ఇవ్వండి’ అంటూ కొంతమంది బయ్యర్స్ దబాయించే రేంజ్ కి ఇది వెళ్ళింది.సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ఫ్యామిలీ స్టార్ (The Family Star) నిరాశపరిచింది.
థియేట్రికల్ గా ఈ సినిమా ప్లాప్. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ బయ్యర్స్ ‘మమ్మల్ని ఆదుకోవాలని’ చిత్ర బృందం పై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. ఆల్రెడీ విజయ్ దేవరకొండ రూ.5 కోట్ల వరకు వెనక్కి ఇచ్చాడని టాక్ ఉంది. ఇప్పుడు పరశురామ్ ని (Parasuram) కూడా అలా చేయమని కొంతమంది డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.పరశురామ్ ఈ సినిమాకు గాను రూ.12 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది.