సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. కొన్నాళ్లుగా నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి మరణించారు. ఆ తర్వాత స్టార్ నటుడు నాజర్ తండ్రి కూడా వయసు సంబంధిత సమస్యలతో మరణించడం జరిగింది.మరోపక్క మలయాళ నటుడు కుందర జానీ, విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు,బాలీవుడ్ నటి భైరవి, ‘సింగం’ దర్శకుడైన హరి తండ్రి వీఏ గోపాలకృష్ణన్ శృంగార నటి బాబిలోనా సోదరుడు విక్కీ వంటి వారు మరణించారు.
ఈ షాక్ ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోక ముందే మరో నటుడు మరణించినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..ప్రముఖ హాలీవుడ్ నటుడు, అమెరికాకు చెందిన కమెడియన్ మాథ్యూ పెర్రీ ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 54 ఏళ్లు. కొన్నాళ్లుగా ఆయన ఒంటరిగా జీవిస్తున్నాడు. అయితే అనుమానాస్పద రీతిలో ఆయన హాట్ టబ్ లో పడి చనిపోయి విగతజీవిగా కనిపించాడు. ఈ విషయాన్ని అతని అసిస్టెంట్ పోలీసులకి తెలియజేసినట్టు సమాచారం.
ఇక ఫెర్రీ ‘ఫ్రెండ్స్’ అనే వెబ్ సిరీస్ లో చాండ్లర్ బింగ్ పాత్రకు (Matthew perry) గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అతను పాపులర్ అయ్యాడని చెప్పవచ్చు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. పెర్రీ క్లాస్మెట్ అనే సంగతి కూడా తెలిసిందే అని చెప్పాలి. ఇక ఫెర్రీ మరణంపై టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కామెంట్లు పెడుతున్నారు.