కొన్ని నెలల క్రితమే ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ మారుతి సినిమాకు ఓకే చెప్పి తప్పు చేశారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే పక్కా కమర్షియల్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడంతో ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఆగిపోయినట్టేనని ప్రచారం జరిగింది. నిర్మాత దానయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వైరల్ అయిన వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత తగ్గించాయి.
అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించి వార్తలు వైరల్ కావడంతో మారుతికి నెగిటివ్ గా కొన్ని హ్యాష్ ట్యాగ్ లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఫ్లాప్ డైరెక్టర్లకు స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వకూడదా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతుండటం గమనార్హం. ఫ్లాపుల్లో ఉన్న చాలామంది డైరెక్టర్లు కసితో సినిమాను తెరకెక్కించి విజయాలు సాధిస్తున్న సందర్భాలు సైతం ఉన్నాయి. సీతారామం, కార్తికేయ2 సినిమాల డైరెక్టర్ల గత సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.
మారుతికి ప్రభాస్ ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చిన నేపథ్యంలో ఆ మాట వల్ల ప్రభాస్ వెనక్కు తగ్గడం లేదు. ప్రభాస్ తో తీసిన సినిమా ఫ్లాపైతే మారుతిని ట్రోల్ చేయాలని ఇప్పుడు ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు చెబుతున్నారు. ఈ విధంగా ట్రోల్ చేయడం వల్ల మంచి సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకులు సైతం డిప్రెషన్ కు గురయ్యే ఛాన్స్ ఉంది.
ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి సక్సెస్ ను అందుకున్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఒక సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నంత మాత్రాన దర్శకుడిని నిందించడం కరెక్ట్ కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు హీరోలు ఛాన్స్ ఇవ్వకపోతే ఒకరిద్దరు డైరెక్టర్లు మాత్రమే ఇండస్ట్రీలో మిగులుతారని కామెంట్లు వినిపిస్తున్నాయి.