Prasanth Varma: ప్రశాంత్ వర్మకు ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఇదే.. ఆయన యాక్సెప్ట్ చేస్తారా?

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చాలా సినిమాలు తెరకెక్కినా హనుమాన్ సినిమాతోనే దర్శకుడిగా ఆయన పేరు మారుమ్రోగింది. ఈ సినిమా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు దర్శకుడిగా ప్రశాంత్ వర్మను ఎన్నో మెట్లు పైకి ఎక్కించింది. అయితే ప్రశాంత్ వర్మ ఫ్యాన్స్ లో చాలామంది ప్రశాంత్ వర్మ హీరోలా ఉన్నాడని ఆయన సినిమాల్లో ట్రై చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. నీ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలలో నువ్వే హీరోగా నటిస్తే బాగుంటుంది అంటూ చాలామంది ప్రశాంత్ వర్మ ఫోటోల కింద కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఫ్యాన్స్ కామెంట్ల విషయంలో ప్రశాంత్ వర్మ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మరోవైపు హనుమాన్ సినిమా భారీ హిట్ కావడంతో నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ మధ్య గ్యాప్ వచ్చిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే నిరంజన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయడంతో ఆ ప్రశ్నలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసింది. జై హనుమాన్ సినిమాలో చిరంజీవి, మహేశ్ బాబు నటించాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.

ఈ ఇద్దరు హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే మాత్రం జై హనుమాన్ రేంజ్ మారిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జై హనుమాన్ సినిమాకు కూడా నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. జై హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రశాంత్ వర్మ (Prasanth Varma) భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం బడ్జెట్ కు పది రెట్ల రేంజ్ లో కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హనుమాన్ సీక్వెల్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus