చాలా రోజుల నిరీక్షణ తర్వాత ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ప్రభాస్ గంపగుత్తగా డేట్స్ ఇచ్చేశాడని, వరుస షెడ్యూళ్లతో సినిమా పూర్తి చేసేయాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్ బయటకు రాలేదు. మొన్నామధ్య ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేసి అలా కూడా కనిపించకుండా చేశారు.
దీంతో ప్రభాస్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడనే ఉత్సుకత ఫ్యాన్స్‌లో మొదలైంది. ఎందుకంటే ఇందులో డార్లింగ్ తొలిసారి పోలీసుగా కనిపిస్తాడని, అదికూడా కాస్త నెగిటివ్ టచ్ ఉన్న పోలీసుగా కనిపిస్తాడని చెబుతున్నారు. అయితే దీని కోసం ఓ ట్రిక్ ఉంది. ఈ సినిమా లుక్ సంగతి తేలాలంటే తొలుత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లుక్ తెలియాలి. అవును మీరు చదివింది కరెక్టే. ఎందుకంటే ఆయన గత రెండు సినిమాలప్పుడు ఇదే జరిగింది.

కావాలంటే గూగుల్‌లోకి వెళ్లి సందీప్ రెడ్డి వంగా + అర్జున్ రెడ్డి.. సందీప్ రెడ్డి వంగా + యానిమల్ అని సెర్చ్ చేసి చూడండి. ఆ వర్కింగ్ స్టిల్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సినిమా చేసేటప్పుడు సందీప్ రెడ్డి వంగా చాలా వరకు ఆ సినిమా హీరో లుక్‌కి దగ్గరగా ఉండేలా ఆయన లుక్ మెయింటైన్ చేస్తారు. గడ్డం, హెయిర్, డ్రెస్సింగ్ ఇలా అన్నీ అలానే ట్రై చేస్తారు. ఆ లెక్కన ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమా విషయంలోనూ అలానే చేయొచ్చు.
ఇటీవల సందీప్ ఒకట్రెండుసార్లు మీడియా ముందుకు వచ్చినా లుక్ నార్మల్‌గానే ఉంది. మొన్నీమధ్య చిరంజీవి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించినప్పుడు మీరు చూసే ఉంటారు. అయితే ఇంకా ప్రభాస్ లుక్ ఫైనల్ అవ్వలేదు అని చెప్పాలి. ఇక ఈ సినిమా విషయానికొస్తే త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె కాకుండా మరో సీనియర్ హీరోయిన్ కూడా ఇందులో నటిస్తోందని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని 2026 ఎండింగ్‌లో విడుదల చేస్తారని సమాచారం.
