నిజజీవితంలో తండ్రి కొడుకులు (Father-Son) సినిమాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అంటే సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతుంది. ఇది కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్ అనే చెప్పాలి. కొంతమంది దర్శకులు ఈ ఫార్ములాని కూడా అప్లై చేశారు. ఎన్టీఆర్ – బాలకృష్ణ నుండి చిరు – చరణ్ వరకు చాలా మంది ఈ లిస్టులో ఉన్నారు. ఆ లిస్టుని మీరు కూడా ఓ లుక్కేయండి :
1) చిరంజీవి – రాంచరణ్ (Ram Charan) :
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆయన తనయుడు రాంచరణ్ (Ram Charan) కలిసి ‘మగధీర’ (Magadheera) ‘బ్రూస్ లీ’ (Bruce Lee) ‘ఆచార్య’ (Acharya) వంటి సినిమాల్లో కలిసి నటించారు. ‘ఖైదీ నెంబర్ 150’ లో కూడా ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాటకి కలిసి చిందులేశారు.
2) ఏఎన్నార్ -నాగార్జున :
అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) తన తనయుడు నాగార్జునతో ( Nagarjuna) కలిసి ‘శ్రీరామదాసు’ (Sri Ramadasu) ‘ఇద్దరూ ఇద్దరే’ ‘కలెక్టర్ గారి అబ్బాయి’ వంటి సినిమాల్లో కలిసి నటించారు.
3) నాగార్జున – నాగ చైతన్య :
అక్కినేని నాగార్జున తన పెద్ద కుమారుడు నాగ చైతన్యతో (Naga Chaitanya) కలిసి ‘ప్రేమమ్’ (Premam) ‘మనం’ (Manam) ‘బంగార్రాజు’ (Bangarraju) వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్లు అయ్యాయి.
4) నాగార్జున – అఖిల్ :
అక్కినేని నాగార్జున తన చిన్న కుమారుడు అఖిల్ తో ‘మనం’ సినిమాలో కలిసి నటించారు. అలాగే ‘అఖిల్’ (Akhil) సినిమాలో కూడా ‘అక్కినేని అక్కినేని’ పాటలో అఖిల్, నాగ్ కలిసి డాన్స్ చేశారు.
5) ఎన్టీఆర్ – బాలకృష్ణ :
నందమూరి తారకరామారావు (Sr NTR) గారు తన చిన్న కుమారుడు బాలకృష్ణతో (Balakrishna) కలిసి ‘దాన వీర శూర కర్ణ’ ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ ‘అన్నదమ్ముల అనుబంధం’ వంటి సినిమాల్లో కలిసి నటించారు.
6) కృష్ణ – మహేష్ బాబు :
సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తన చిన్న కుమారుడు మహేష్ బాబుతో (Mahesh Babu) కలిసి ‘కొడుకు దిద్దిన కాపురం’ ‘వంశీ’ (Vamsi) ‘టక్కరి దొంగ’ (Takkari Donga) వంటి సినిమాల్లో కలిసి నటించారు. మహేష్ బాబు డెబ్యూ మూవీ ‘రాజకుమారుడు’ (Rajakumarudu) లో కూడా కృష్ణ ముఖ్య పాత్ర పోషించారు. కానీ అందులో కృష్ణ- మహేష్..ల మధ్య కాంబినేషనల్ సీన్స్ ఉండవు.
7) మహేష్ బాబు – గౌతమ్ :
మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ తో కలిసి ‘1 నేనొక్కడినే’ (1: Nenokkadine) సినిమాలో నటించారు.
8) డా.డి.రామానాయుడు – వెంకటేష్ :
దివంగత స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ అయినటువంటి రామానాయుడు (D. Ramanaidu) గారు ‘సూపర్ పోలీస్’ అనే సినిమాలో తన చిన్న కుమారుడు వెంకటేష్ తో (Venkatesh) కలిసి నటించారు.
9) మోహన్ బాబు – మంచు విష్ణు :
మంచు మోహన్ బాబు (Mohan Babu) కూడా తన పెద్ద కొడుకు మంచు విష్ణుతో (Manchu Vishnu) ‘గేమ్’ (Game) ‘సలీమ్’ (Saleem) ‘పాండవులు పాండవులు తుమ్మెద’ (Pandavulu Pandavulu Tummeda) ‘రౌడీ’ వంటి సినిమాల్లో కలిసి నటించారు.
10) మోహన్ బాబు – మంచు విష్ణు :
మంచు మోహన్ బాబు తన చిన్న కుమారుడు మంచు మనోజ్ తో (Manchu Manoj) ‘ఝుమ్మంది నాదం’ (Jhummandi Naadam) ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి సినిమాల్లో కలిసి నటించారు.
11) కోటా శ్రీనివాసరావు :
సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) కూడా తన కొడుకు కోటా ప్రసాద్ తో ‘గాయం 2’ సినిమాలో కలిసి నటించారు. తర్వాత ప్రసాద్ ప్రమాదవశాత్తు మృతి చెందిన సంగతి తెలిసిందే.
12) గిరిబాబు – రఘుబాబు :
సీనియర్ నటుడు గిరిబాబు (Giri Babu) తన కుమారుడు రఘుబాబుతో (Raghu Babu) ‘ఎవడైతే నాకేంటి’ వంటి సినిమాల్లో కలిసి నటించాడు.
13) చలపతిరావు :
సీనియర్ నటుడు చలపతిరావు (Chalapathi Rao) కూడా తన కుమారుడు రవిబాబుతో (Ravi Babu) ‘లక్ష్యం’ (Lakshyam) ‘రారా కృష్ణయ్య’ (Ra Ra Krishnayya) ‘దోచేయ్’ (Dohchay) వంటి సినిమాల్లో కలిసి నటించారు.
14) ఎం.ఎస్.నారాయణ – విక్రమ్ :
సీనియర్ స్టార్ కమెడియన్ ఎం.ఎస్.నారాయణ (M. S. Narayana) కూడా తన కొడుకు విక్రమ్ తో కలిసి ‘కొడుకు’ సినిమాలో నటించారు. దానికి ఎం.ఎస్.నారాయణ దర్శకత్వం వహించడం విశేషంగా చెప్పుకోవాలి.
15) కృష్ణ – రమేష్ బాబు :
‘ముగ్గురు కొడుకులు’ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కుమారుడు రమేష్ బాబుతో (Ramesh Babu) కలిసి నటించారు.
16) విక్రమ్ – ధృవ్ విక్రమ్ :
‘మహాన్’ అనే సినిమాలో విక్రమ్ (Vikram) తన కొడుకు ధృవ్ విక్రమ్ తో కలిసి నటించారు.
17) బ్రహ్మానందం – రాజా గౌతమ్ (Raja Goutham) :
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) గారు ‘పల్లకిలో పెళ్లికూతురు’ ‘బ్రహ్మానందం’ (Brahmanandam) వంటి సినిమాల్లో కలిసి నటించారు.