రివ్యూల వల్ల ఫ్లాపవ్వాల్సిన సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ.. హిట్ అవ్వాల్సిన సినిమా రివ్యూల వల్ల ఫ్లాప్ అయిన చరిత్ర యావత్ ప్రపంచ చరిత్రలోనే లేదు. అయినా.. బాలేని సినిమాకు బాగుంది అని రివ్యూలు రాస్తారు కానీ.. బాగున్న సినిమాకి బాలేదు అని ఏ ఒక్క జర్నలిస్ట్ కానీ రివ్యూ రైటర్ కానీ రాసిన దాఖలాలు లేవు. రివ్యూలు బాలేదు అని చెప్పినా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. “సరైనోడు” చిత్రం అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
కానీ.. “దొరసాని” నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాత్రం రివ్యూ రైటర్ల విషయంలో మరియు రివ్యూల విషయంలో చాలా బాధపడ్డారు. “దొరసాని” చిత్రాన్ని ప్రేక్షకులు ఆశ్వీర్వదించారు కానీ.. రివ్యూ రైటర్లు మాత్రం ఏకీపాడేశారు. ఆ విషయంలో చాలా బాధపడ్డాను అని పేర్కొన్నారు మధుర శ్రీధర్ రెడ్డి. ఆయన బాధలో అర్ధం ఉన్నా.. తప్పు మొత్తం రివ్యూ రైటర్లదే అన్నట్లుగా మాట్లాడడం మాత్రం సమంజసం కాదు.