Arul Saravanan: ట్రోల్స్ పై స్పందించిన లెజెండ్ హీరో శరవణన్.. ఏం చెప్పాడంటే?

ది లెజెండ్ సినిమాతో ఊహించని స్థాయిలో పాపులర్ అయిన అరుళ్ శరవణన్ కు నటుడిగా ఆ సినిమా మంచి పేరే తెచ్చిపెట్టినా లుక్స్ విషయంలో అరుళ్ శరవణన్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. అరుళ్ శరవణన్ గురించి ఎన్నో మీమ్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా అరుళ్ శరవణన్ తనపై వచ్చిన ట్రోల్స్ గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ నన్ను విమర్శించారని అరుళ్ శరవణన్ చెప్పుకొచ్చారు. తొలినాళ్ల నుంచి మీడియా నుంచి తనకు ఎంతగానో సపోర్ట్ లభించిందని ఆయన అన్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మిక్స్డ్ రెస్పాన్స్ తో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోందని అరుళ్ శరవణన్ చెప్పుకొచ్చారు. విమర్శలే సక్సెస్ కు తొలిమెట్టుగా తాను భావిస్తానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. ప్రస్తుతం తాను మరో మూవీలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని శరవణన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం శరవణన్ రొమాంటిక్ ఫ్యామిలీఎంటర్టైనర్ లో నటించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని బోగట్టా. అరుళ్ శరవణన్ పై ప్రేక్షకుల్లో సైతం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అరుళ్ శరవణన్ డబ్బును వృథా చేస్తున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అరుళ్ శరవణన్ అనవసరంగా తన పరువు పోగొట్టుకుంటున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అరుళ్ శరవణన్ తను నటించడానికి బదులుగా స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరుళ్ శరవణన్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అరుళ్ శరవణన్ గతంలో కూడా పలు యాడ్స్ లో నటించిన సంగతి తెలిసిందే. మరి కొందరు మాత్రం పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో అరుళ్ శరవణన్ నటిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus