పాట నాది.. కానీ మాట మార్చేశారు : కోమలి

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రం కోసం మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుండీ విడుదలవుతున్న లిరికల్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో పాటు సినిమా పై అంచనాలను కూడా పెంచేస్తున్నాయి. అయితే తాజాగా విడుదలైన ‘సారంగ దరియా’ అనే పాట ఓ పక్క యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తూనే మరోవైపు వివాదాలను కూడా రేపుతూ వార్తల్లో నిలుస్తుంది. ప్రముఖ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ ఈ పాటకు కర్త అని చిత్ర యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తుండడంతో..

దీనికి వరంగల్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన కోమలి అనే అమ్మాయి అభ్యంతరం వ్యక్తం చేసింది.గతంలో ‘రేలా రే రేలా’ షోలో మొదటిసారి ఈ ‘సారంగ దరియా’ జానపదాన్ని పాడి జనానికి వినిపించింది కోమలి. ఈ విషయం పై కోమలి మాట్లాడుతూ.. ” ‘లవ్ స్టోరీ’ కోసం ఈ సాంగ్‌ని సుద్దాల అశోక్ తేజ నుండీ సేకరించినట్లుగా ప్రచారం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. దీనికి కర్త నేను. ప్రోమో చూశాక నేను మోసపోయాను అని అర్ధమయ్యింది. ఈ విషయం పై అశోక్ తేజ గారికి ఫోన్ చేస్తే ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు.ఈ పాటను నా దగ్గర నుండే సేకరించారు. ప్రోమో వచ్చాక.. శేఖర్ సార్ పాడతావా? అని కూడా నన్ను అడిగారు. అయితే గొంతు బాలేని కారణంగా ఓ 10 రోజులు టైమ్ కావాలని చెప్పాను.

ఇప్పుడైతే అంత టైం లేదు. ఆడియో ఫంక్షన్‌లో పాడిస్తాంలే.! అని సమాధానమిచ్చారు.అంతేకాదు అశోక్ తేజ గారి పక్కనే నీ పేరు కూడా వేస్తాం అని చెప్పారు. తరువాతి సినిమాలో ఛాన్స్ ఇస్తామని కూడా శేఖర్ కమ్ముల చెప్పారు. కానీ ఇప్పుడు మాట మార్చి నాకు దక్కాల్సిన క్రెడిట్ ఇవ్వడం లేదు(కన్నీళ్లు పెట్టుకుంటూ). ఇప్పుడు మంగ్లీ చేత పాడించారు.. కానీ ఈ పాటలో ఫోక్ లేదు, పల్లెదనం అస్సలే లేదు.. ఆమె పాడిన విధానం ఏమీ బాలేదు. ఈ పాట అస్సలు నాకు నచ్చలేదు. నాది ఒక్కటే కోరిక టైటిల్స్ లో నా పేరు కూడా వెయ్యాలి. నాకు కూడా క్రెడిట్ ఇవ్వాలి” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus