రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ గురించి ఏ చిన్న అప్డేట్ అయినా అది సంచలనమే. మరి రాజమౌళి సినిమాలకు ఉండే క్రేజ్ అలాంటిది మరి. కాగా ఇవాళ ఈ చిత్రం గురించి ఓ ఆకక్తికర వార్త బయటికి వచ్చింది. అదేమిటనగా ప్రజా గాయకుడు మరియు రచయిత గద్దర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం కొరకు ఓ పాట రాయనున్నారట. రాయడంతో పాటు ఆయన స్వయంగా పడతారని తెలుస్తుంది. కొమరం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కొరకు ఈ పాట ఆయన రాస్తున్నారని సమాచారం. ఐతే ఈ పాట ఎలా ఉండబోతుంది అనేదానిపై ఒక స్పష్టత వచ్చేసింది.
కొమరం భీమ్ పోడు వ్యవసాయం చేసుకునే అడవి తెగ ప్రజలపై నైజాం పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నైజాం సైన్యంపై ఆయుధం పట్టి గెరిల్లా యుద్దాలు చేశారు. ఈనేపధ్యంలో గద్దర్ రచించి..ఆలపించే పాట అడవి జాతి ప్రజలు గోడు తెలియజేసేదిగా.. మరియు నైజాం పాలకుల అరాచకాలను వివరించేదిగా.. ఉండే అవకాశం కలదు. నైజాం పాలకులపై కొమరం భీమ్ వీరోచిత పోరాటాలను తెలిపేదిగా కూడా వుండవచ్చు. గద్దర్ పాత్ర ఆర్ ఆర్ ఆర్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. మరో రచయిత సుద్దాల అశోక్ తేజ ఆర్ ఆర్ ఆర్ కొరకు మూడు సాంగ్స్ రాయడం జరిగింది. ఈ పాటల నేపథ్యం..సాహిత్యానికి సంబంధించి కనీసం భార్యకు కూడా చెప్పొద్దని రాజమౌళి, అశోక్ తేజ వద్ద మాట తీసుకున్నారట. మరో స్టార్ హీరో రామ్ చరణ్ అల్లూరి పాత్ర చేస్తుండగా ఆర్ ఆర్ ఆర్ జులై 30న విడుదల కానుంది.